సుశాంత్‌ కు రియా డ్రగ్స్‌ ఇచ్చింది

Update: 2020-08-26 15:00 GMT
సుశాంత్‌ మృతి కేసులో రియా చక్రవర్తి మొన్నటి వరకు అనుమానితురాలిగా మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు ఒకొక్కటిగా బయటకు వస్తున్న విషయాలు జరుగుతున్న ప్రచారాలు చూస్తుంటే ఆమె అనుమానితురాలు కాదు ఖచ్చితంగా దోషి అయ్యి ఉంటుందని సుశాంత్‌ అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. రియా గురించి రోజుకు ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఆమె కావాలని సుశాంత్‌ ను హత్య చేసిందా లేదంటే ఆమె సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందా అంటూ కొత్త ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి.

ఇటీవల రియా చక్రవర్తికి డ్రగ్స్‌ డీలర్‌ తో సంబంధం ఉన్నట్లుగా ఆయనతో మాట్లాడినట్లుగా చాటింగ్‌ చేసినట్లుగా వెళ్లడి అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో రియా లాయర్‌ ఆ విషయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నాడు. రియాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరీక్షలు చేసుకోవచ్చు అన్నాడు. మరో వైపు సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ తరపు లాయర్‌ వికాస్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. సుశాంత్‌ కు కొంత కాలంగా రియా డ్రగ్స్‌ ను ఇస్తున్నట్లుగా అనుమానం ఉంది. డాక్టరు్ లు రాయని చాలా మందులను ఆమె సుశాంత్‌ వేసుకునేలా ఒప్పించేదని అవి డ్రగ్స్‌ అయ్యి ఉంటాయేమో అంటూ సుశాంత్‌ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు రియాకు డ్రగ్స్‌ డీలర్‌ తో సంబంధం ఉందని తెలియడంతే అది నిజమే అన్నట్లుగా వికాస్‌ సింగ్‌ ఆరోపిస్తున్నాడు. నిశేదిత డ్రగ్స్‌ ను అతడికి ఇచ్చి బలవంతంగా చనిపోయేలా ప్రేరేపించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ కేసులో కొత్త టర్న్‌ సుశాంత్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. రియాను ఎట్టి పరిస్థితుల్లో శిక్షించి తీరాలి అంటున్నారు.
Tags:    

Similar News