తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకులు అయిన విక్రమ్ ధృవ్ ల మల్టీస్టారర్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. వీరిద్దరి కాంబోలో కార్తీక్ సుబ్బరాజు ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే విక్రమ్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఆ సినిమాలో ధృవ్ నటించేది లేనిది క్లారిటీ లేకపోవడంతో ఆ వార్తలు కేవలం పుకార్లు అయ్యి ఉంటాయని అనుకున్నారు.
తాజాగా ఆ పుకార్లే నిజం అంటూ క్లారిటీ వచ్చేసింది. విక్రమ్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రంలో ధృవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ చేస్తున్న ధనుష్ చిత్రం జగమే తంత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఈ క్రేజీ మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
మొదట విక్రమ్ మూవీలో ధృవ్ ను పావు గంట పాత్రకే అనుకున్నారట. కాని వీరిద్దరి కాంబోకు ఉన్న క్రేజ్ చూసి ధృవ్ పాత్ర నిడివి పెంచాలనే నిర్ణయానికి వచ్చారట. ధృవ్ స్క్రీన్ ప్రజెన్స్ కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు ఉండేలా స్క్రీన్ ప్లే తయారు చేస్తున్నారట. ఆధిత్య వర్మ చిత్రంతో ఆకట్టుకున్న ధృవ్ రెండవ సినిమాతోనే తండ్రితో కలిసి నటించడం చాలా పెద్ద విషయం అంటున్నారు.