మ‌ణిర‌త్నం.. విక్ర‌మ్ ని అవ‌మానించిన‌ట్టేనా?

Update: 2022-03-03 08:30 GMT
లెజెండ‌రీ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్‌`. గ‌త కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ ని తెర‌పైకి తీసుకురావాల‌ని ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఎట్ట‌కేల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ రంగంలోకి దిగ‌డంతో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కార్య‌రూపం దాల్చింది. మ‌ణిర‌త్నం దర్శక‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ పిరియాడిక్ డ్రామాని తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి మ‌ద్రాస్ టాకీస్ నిర్మిస్తోంది. లార్జ‌న్ దెన్ లైఫ్ మూవీ కావ‌డంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు.

బాహుబ‌లి, కేజీఎఫ్, పుష్ప ఫార్మాట్ లో రూపొందుతున్న ఈ మూవీ తొలి పార్ట్ ని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నామంటూ చిత్ర బృందం బుధ‌వారం సాయంత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ఇదే సంద‌ర్భంగా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న విక్ర‌మ్‌, కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌, జ‌యం ర‌వి, త్రిష ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ల‌ని విడుద‌ల చేసింది. ఇదే ఇప్పుడు త‌మిళ‌నాట వివాదంగా మారింది. ఈ చిత్రంలో న‌టిస్తున్న సీనియ‌ర్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ క‌రికాళ‌న్ గా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

అత‌ని పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్  ఫ్యాన్స్ తో పాటు సినీ ల‌వ‌ర్స్ ఆశించిన స్థాయిలో ఏ మాత్రం లేక‌పోవ‌డం ఇప్పుడు వివాదానికి ప్ర‌ధాన కార‌ణంగా మారింది. విక్ర‌మ్ ఫ‌స్ట్ లుక్ అంటూ మేక‌ర్స్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ పై అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులు మండిప‌డుతున్నారు. దీనిపై నెట్టింట భారీ చ‌ర్చ జ‌రుగుతోంది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ లో విక్ర‌మ్ లుక్ అస్స‌లు బాగాలేద‌ని, పోస్ట‌ర్ చాలా వ‌ర‌స్ట్ గా వుంద‌ని, పోస్ట‌ర్ ప్రాప‌ర్ గా లేద‌ని, వీడియో నుంచి క‌ట్ చేసిన స్టిల్ లా వుంద‌ని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారట‌. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా త‌మ హీరో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని మ‌ణిర‌త్నం రిలీజ్ చేసిన తీరుకు హ‌ర్ట్ అయ్యామ‌ని ఫ్యాన్స్ మ‌ణిర‌త్నంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ లు చేస్తున్నారట‌.  

పాన్ ఇండియా స్థాయి మూవీ చేస్తున్న‌ప్పుడు క‌నీసం జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా అలా ఎలా రిలీజ్ చేస్తార‌ని, విక్ర‌మ్ ఫ్యాన్స్ మ‌ణిర‌త్నంపై సీరియ‌స్ అవుతున్న‌ట్టుగా త‌మిళ మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కార్తి, జ‌యం ర‌వి ల లుక్స్ బాహుబ‌లి తో పాటు చ‌రిత్ర‌క చిత్రాల్లోని పాత్ర‌ల‌కు కాపీలా వున్నాయిని సెటైర్లు వేస్తున్నారని తెలిసింది.  అంతే కాకుండా ఐశ్వ‌ర్యారాయ్ లుక్ పై కూడా కామెంట్ లు పేలుతున్నాయి. ఫ‌స్ట్ లుక్ లో ఐష్ ని చూపించిన తీరు ఏదో ప్లాస్టిక్ స‌ర్జరీ చేపిన‌ట్టుగా.. మార్ఫింగ్ స్టిల్ వాడిన‌ట్టుగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. పోస్ట‌ర్ ల‌ని మార్ఫింగ్ చేసి ఆ బాడీల‌కు స్టార్ ల హెడ్ లు అంటించార‌ని, అందుకే ఒరిజిన‌ల్ ఫీల్ క‌ల‌గ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

త‌మిళ ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ విష‌యంలో ఇలాగేనా ప్ర‌వ‌ర్తించేది. ఇంత సిల్లీగా ఎలా అప్ డేట్ ఇస్తారంటూ ఫ్యాన్స్ మ‌ణిర‌త్నంపై కామెంట్ లు చేస్తున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై మ‌ణిర‌త్నం ఎలా స్పందిస్తారా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

10వ శ‌తాబ్దం నేప‌థ్యంలో చోళ‌రాజుల ఎంపైర్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రాజ్యం కోసం రాజ్యాధికారం కోసం చోళ‌వంశంలోని వ‌ర్గాలు, కుటుంబీకులు ఎలాంటి ఎత్తులు వేశారు?.. ఎలాంటి అంత‌ర్యుద్ధం జ‌రిగింది? అ నే కోణంలో క‌ల్కీ కృష్ణ‌మూర్తి అందించిన ఫేమ‌స్ న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఏ.ఆర్ . రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. త‌మిళ‌, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కానుంది.


Tags:    

Similar News