సీక్వెల్, ప్రీక్వెల్.. ఏది తీయచ్చంటే..

Update: 2016-05-11 11:07 GMT
కాలాన్ని ముందుకు వెనక్కు తిప్పడం - నిలబెట్టేయడం.. ఇలా సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన 24 మూవీ అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంటోంది. అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ రిపోర్టులతో దూసుకుపోతోంది. ఇప్పుడు సీనిమాకి సీక్వెల్ పై డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. 24లో వదిలేసిన కొన్ని పాయింట్స్ పట్టుకుని సీక్వెల్ తీసే అవకాశాలున్నాయి.

మూవీ క్లైమాక్స్ లో విలన్ ఆత్రేయ.. చనిపోయాడని అర్ధమవుతుంది. కానీ ఆత్రేయకు బుల్లెట్ తగిలినట్లు దర్శకుడు చూపించలేదు. రక్తం మరక ఉన్నా.. అది తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్ అని పక్కాగా చెప్పలేం. కాల్చిన బుల్లెట్ గాల్లో ఆగడం చూపించినపుడు.. బుల్లెట్ దిగిన విషయాన్ని చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ పని చేయలేదు. ఇది ఒక పాయింట్ అయితే.. ఒక వేళ బుల్లెట్ తగిలినా - ఆత్రేయ కేరక్టర్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి పక్కనే ఓ అసిస్టెంట్ హర్షవర్ధన్ బతికే ఉంటాడు. ఇక శివకుమార్ పాత్ర తను తయారు చేసిన వాచ్ ను విసిరేస్తుందంతే. దాన్ని డిస్మాండిల్ చేయకుండా పడేయడాన్ని గమనించాలి.

పైగా ఈ వాచ్ ఎక్కడో కాదు.. ఆత్రేయ పడిఉన్న ప్లేస్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. ఇక అన్నిటి కంటే మించి, కథను మలుపులు తిప్పే గద్ద పాత్రతో అయినా సీక్వెల్ కు అవకాశముంది. సీక్వెల్ కు ఇన్ని అవకాశాలు ఉండగా.. డైరెక్టర్ వెర్షన్ వేరేగా ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ తీయాలని అనుకుంటున్నట్లు దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యకరం.
Tags:    

Similar News