పాన్ ఇండియా మూవీ.. ఈ సౌండ్ సరిపోదమ్మా?

Update: 2022-05-23 17:30 GMT
పాన్ ఇండియా అనేది ఇటీవల కాలంలో పెద్ద హీరోలకు ఆనవాయితీగా మారిపోతుంది. ఒక్కసారి అటు వైపు వెళితే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా దేశవ్యాప్తంగా సినిమాలను విడుదల చేయాలని అనుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా కూడా మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అయితే ఆ తరహాలో తొందరపడి విడుదల చేసిన అన్ని సౌత్ సినిమాలకు కూడా సక్సెస్ కావడం లేదు.

ఇక ప్రస్తుతం కమల్ హాసన్ విక్రమ్ సినిమా కూడా అసలైన పాన్ ఇండియా సినిమా అని ప్రమోషన్ చేస్తోంది. కానీ అసలు ఈ సినిమాకు ఆ ఏజ్ లో అయితే బజ్ క్రియేట్ కావడం లేదు.

నటన ప్రపంచంలో ఒక నాయకుడిగా గుర్తింపు అందుకున్న కమల్ హాసన్ సినిమా అంటే ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండేవి.

కానీ చాలా కాలంగా ఆయన సినిమాలతో అనుకున్నంతగా సక్సెస్ అవ్వడం లేదు అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఇక మొదటి సారి టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన విక్రమ్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతుంది అని జూన్ 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అసలైన ఫ్యాన్ ఇండియా సినిమా అంటున్నారు కానీ అందుకు తగ్గ హడావిడి అసలు ఏమి కనిపించడం లేదు.

హిందీలో అయితే ఈ సినిమా ట్రైలర్ కు చాలా తక్కువ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అగ్రనటులు కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాలో నటించడం ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఆసక్తిని కలిగిస్తుంది. కానీ తమిళంలో తప్పితే మిగతా భాషల్లో పెద్దగా హైప్ రావడం లేదు.

తెలుగులో అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేయగలదు. కానీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేస్తున్నారు అంటే విడుదలకు ముందు ఈ స్థాయిలో హైప్న్అయితే సరిపోదు. సినిమా ట్రైలర్ కూడా ఇంకా అనుకున్నంతగా రెస్పాన్స్ అయితే రాలేదు. మరి కమల్ హాసన్ ఈ రూట్లో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News