విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నాడంటే...

Update: 2017-06-18 09:36 GMT
జాతీయ ఉత్తమ నటుడు తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో రాబోతున్న 'ధృవ నక్షత్రం' ఇప్పుడు మరింత హంగులుతో రాబోతుంది. సౌత్ స్టార్ హీరోలు సినిమాలలో ఈ ఏడాది విడుదలకబోతున్న ఆసక్తికర సినిమాలలో ఇది ఒకటి. ఇప్పటికే చియాన్ తన గ్రే హెయిర్ లుక్ తో బ్లాక్ స్లిమ్ సూట్ లో టీజర్ లో నడిచి సంచలనం అయ్యాడు సోషల్ మీడియాలో.ఇప్పుడు ఈ స్పై థ్రిల్లర్ డ్రామా కోసం విదేశాలు వెళుతున్నారు ఈ టీమ్.

ఇప్పుడు విక్రమ్ తన స్కెచ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ షెడ్యూల్ వచ్చే వారంతో పూర్తికావస్తుంది. దీని వెంటనే  ధృవ నక్షత్రం సినిమా కోసం స్లొవేనియా దేశం ప్రయాణం కాబోతున్నాడు. ఈ సినిమా థ్రిల్లర్ కావడంతో పైగా ఈ సినిమాలో విక్రమ్ చేస్తున్నది గూఢచారి పని కాబట్టి ఈ దేశంతో ఈ సినిమాలో ఏదో కథ ఉంది అని అర్ధం అవుతుంది. ఎందుకు అక్కడకు వెళ్లాడో మనం సినిమా చూసి తెలుసుకోవలిసిందే. పైగా ఇప్పటివరకు మనోళ్ళు పాటలలో కూడా టచ్ చేయని లొకేషన్లలో ఆ సినిమాను తీస్తారట. ఈ మధ్య కాలంలో ఇదే లొకేషన్లో 'ఖైదీ నెం 150' సాంగ్స్ షూట్ చేశారు.

ధృవ నక్షత్రం సినిమాను డైరెక్ట్ చేస్తున్నది గౌతమ్ మీనన్, సంగీతం హారిస్ జయరాజ్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్ళిచూపులు హీరోయిన్ రీతు వర్మ విక్రమ్ కు జంటగా నటిస్తుంది. ఈ సినిమాకు నిర్మాత గౌతమ్ మీనన్. ఆగష్టు నెలలో ఈ సినిమాను తెలుగు తమిళ్ భాషలలొ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్కెచ్ సినిమా  షూటింగ్ 80 శాతం  పూర్తి కావడంతో ఈ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News