సూపర్ విలన్ ఫస్ట్ లుక్: హను-మాన్ ను ఢీకొట్టే డూమ్ మ్యాన్..!

Update: 2022-06-08 06:30 GMT
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరియు యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా సినిమా ''హను-మాన్''. 'జాంబీ రెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత మరో కొత్త జోనర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి దర్శక హీరో రెడీ అయ్యారు. ఇది ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ఇప్పటికే విడుదలైన ''హనుమాన్'' టైటిల్ టీజర్ - ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్.. ఇలా ఏ ప్రమోషనల్ కంటెంట్ వదిలినా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బల్లాలదేవ రానా దగ్గుబాటి సినిమాలోని ప్రతినాయకుడు, 'మ్యాన్ ఆఫ్ డూమ్' మైఖేల్ లుక్ ని ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

'హనుమాన్' చిత్రంలో బాదాస్ ఈవిల్ మ్యాన్ మైఖేల్ గా విలక్షణ నటుడు వినయ్ రాయ్ నటించారు. ఫస్ట్ లుక్ లో పొడవాటి కస్టమ్ మేడ్ సూట్ ధరించి, ఒక గుడి ముందు క్రూరంగా నడుస్తూ కనిపించారు. అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన గ్యాస్ మాస్క్ మరియు పైరేట్ ఐ ప్యాచ్ ధరించాడు.

బ్యాగ్రౌండ్ లో భారీ మెషిన్ గన్లను మోస్తున్న తన సొంత సైన్యంతో పాటుగా.. రోబోటిక్ గబ్బిలాల నిఘాలో ఉన్న మైఖేల్ సైన్యాన్ని చూడవచ్చు. ఈ సెటప్ అంతా అతని రూపానికి క్రూరత్వాన్ని జోడిస్తుంది. ఫస్ట్ లుక్ లోనే భయంకరంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు వినయ్.
 
బ్యాట్ మ్యాన్ కు జోకర్.. సూపర్ మ్యాన్ కోసం లెక్స్ లూథర్ లాగా.. ఇక్కడ హను-మాన్ కు మైఖేల్ సూపర్ విలన్ గా కనిపించనున్నారు. అయితే మైఖేల్ సాధారణ సూపర్ విలన్ మాత్రమే కాదు. అతను గొప్ప క్యారెక్టర్ ఆర్క్ కలిగి ఉంటాడని ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించిన సుపీరియర్ టెక్నాలజీని బట్టి అర్థం అవుతుంది.

మైఖేల్ ఎక్కడ నుండి వచ్చాడు? అంజనాద్రి లోకానికి ఎందుకు వస్తాడు? హనుమాన్ తో ఎలా ఢీకొట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. 'హను-మాన్' సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.

శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్. పెద్ద స్టార్స్ తో పాటుగా టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు.

నలుగురు ప్రతిభావంతులైన మ్యూజిక్ కంపోజర్స్ అనుదీప్ దేవ్ - హరి గౌరా - జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. స్క్రిప్ట్ విల్లే స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఎస్బీ రాజు తలారి ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. 'హనుమాన్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు.
Tags:    

Similar News