తెలుగులో ఉన్న బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్లలో వి.వి.వినాయక్ ఒకడు. హీరోలతో సమానంగా ఇమేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న అతి కొద్ది మంది దర్శకుల్లో అతనొకడు. ఓ సినిమాపై వినాయక్ ముద్ర పడిందంటే చాలు.. అందులో హీరో హీరోయిన్లెవరో కూడా చూడకుండా సినిమాకు వెళ్లిపోయే ప్రేక్షకులు చాలామందే ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి కొత్త కుర్రాడు నటించిన ‘అల్లుడు శీను’ సినిమా కూడా 20 కోట్ల దాకా వసూలు చేసిందంటే అందుకు కారణం వినాయకే అనడంలో ఎవ్వరికీ సందేహాల్లేవు. ఐతే మాస్ లో ఎంత ఫాలోయింగ్ తెచ్చుకున్నప్పటికీ.. ఎప్పుడూ రొటీన్ సినిమాలే చేస్తాడు, కొత్తదనం కోసం ట్రై చేయడు.. ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్ అస్సలు చేయలేడు అన్న విమర్శలున్నాయి వినాయక్ మీద.
ఈ విమర్శల గురించి వినాయక్ దగ్గర ప్రస్తావిస్తే.. తన మీద ఉన్న అంచనాల మేరకు సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నానని.. ఐతే తనకూ భిన్నమైన సినిమాలు చేయాలని ఉంటుందని చెప్పాడు. ‘‘దర్శకుడిగా నా తొలి సినిమాగా ఓ లవ్ స్టోరీ చేయాలనుకున్నా. కానీ అనుకోకుండా ఆది లాంటి మాస్ సినిమా పడింది. ఇక అప్పట్నుంచి నా నుంచి మాస్ సినిమాలే ఆశిస్తున్నారు. నిర్మాతలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. ‘మాకు మంచి కమర్షియల్ సినిమా కావాలి’ అంటారు. బన్ని సినిమాకు ముందు కూడా అల్లు అర్జున్ తో ఓ కొత్త కథ అనుకున్నా. కానీ కుదర్లేదు. ఎప్పటికప్పుడు ఏవైనా కొత్త కథలు, లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటూనే కెరీర్ ఇలా సాగిపోతోంది. సినిమా అన్నది కోట్లతో ముడిపడ్డ వ్యవహారం. నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాలి’’ అని చెప్పాడు వినాయక్.