తెలుగు సినిమా దర్శకులలో చాలామంది అప్పుడప్పుడూ కెమెరా వెనుక నుండి ముందుకు వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి తమ సరదాలు తీర్చుకుంటారు. కె. విశ్వనాథ్, దాసరి నారాయణ రావు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి వాళ్ళైతే హీరోలుగా కూడా చేశారు. ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాధ్, క్రిష్ లాంటి వాళ్ళు చాలా సినిమాలలో చిన్న పాత్రల్లో కనిపించారు. ఇక ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఠాగూర్ సినిమాలో చిన్న క్యారక్టర్ చేసి మెప్పించారు. అయితే ఇప్పుడు ఆయనకు దర్శకుడిగా సరైన హిట్స్ లేకపోవడంతో ఫుల్ టైం నటుడిగా మారాలని డిసైడ్ అయ్యి ఆయనే ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజును ప్రొడ్యూసర్ గా నిలబెట్టింది వీవీ వినాయక్. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు దిల్ రాజు వినాయక్ హీరోగా ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వినాయక్ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే 15 కేజీల వెయిట్ తగ్గాడు. అంతేకాదు విగ్గు పెట్టుకుని తన ఏజ్ ని కూడా సగం తగ్గించుకుని కుర్ర హీరోలా మారిపోయాడు. ఇటీవల ఆయన ఏ ఫంక్షన్ కి వెళ్లినా ఇదే గెటప్ లో వెళ్తున్నారు. డైరెక్టర్ గా ఉన్నపుడు ఎంతో హుందాగా ఉండేవాడు వినాయక్. అందరూ చాలా మర్యాద ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఉన్న లుక్ లో వినాయక్ ని చూసి ఆయన ముందు మర్యాదగా మాట్లాడినా ఆయన వెనుక నవ్వుకుంటున్నారు.