ఒక భాషలో హిట్ అయితే వెంటనే వేరే భాషలో ఆ సినిమాను రీమేక్ చేయడమో లేకపోతే డబ్బింగ్ చేసి విడుదల చేయడమో చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఒక్క దగ్గర బాగ ఆడిన సినిమాలు వేరే దగ్గర అనుకున్నంత బాగ ఆడవు. తమిళనాడులో నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్ హీరోగా నటించిన విఐపి పెద్ద హిటైంది. ఈ సినిమాలో హీరో బి.టెక్ చదివి జాబ్ లేకుండా పడే కష్టాన్నికి మన తెలుగులో కూడా మంచిగా ఆరాదించారు. అదే సినిమాను రఘువరన్ బి.టెక్ గా విడుదల చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టాడు తమిళ్ హీరో ధనుష్. ఈ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న విఐపి2 కు ఇప్పుడు తెలుగులో విడుదలవుతుంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయి.
విషయం ఏంటంటే మన తెలుగులో విఐపి అంటే ఎవరికి తెలియదు. రఘువరన్ బి.టెక్ అంటేనే అందరూ గుర్తుపడతారు. కానీ ఈ సినిమా సీక్వెల్ మాత్రం మన తెలుగులో విఐపి2 గానే విడుదల చేస్తున్నారు. రఘువరన్ హిట్ కావడంతో పైగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ నటించడంతో తెలుగులో కూడా విఐపి2 కు మంచి గిరాకీ ఏర్పడింది. దాన్ని అలుసుగా చేసుకొని విఐపి2 టీమ్ వాళ్ళు తెలుగులో రైట్స్ కావాలి అంటే కనీసం 12 కోట్లు ఇవ్వండి లేకుంటే వేరే వాళ్ళకి అమ్ముతాము అని చెప్పుకువస్తున్నారు. మొదటి కాపీనే 12 కోట్లు పెట్టి తీసుకుంటే మిగిలన ఖర్చులు కలుపుకొని మొత్తానికి 16 కోట్లు అవుతుంది మావల్ల కాదు అని మన వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు. పైగా ఈ సినిమా పేరు కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. రఘువరన్ 2 అనో రఘువరన్ ఎమ్ టెక్ అనో ఉంటే అప్పుడు ఆలోచించే వాళ్ళం అని చెప్పి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్లిపోతున్నారు.
విఐపి2 సినిమా తెలుగులో ఇంకా విడుదల కాలేదు కాని తమిళనాడులో విడుదలై టాక్ అంత గొప్పగా ఏమి రాలేదు మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది . సినిమా కలెక్షన్లు కూడా ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్నాయని టీమ్ చెబుతోంది. అయితే తెలుగులో ఎవరో ఎందుకు మనమే విడుదల చేసేస్తే పొలా అని భావించి తమిళలో విడుదల చేసిన వారే తెలుగులో కూడా విడుదల చేసుకుంటున్నారు. కాని 16 కోట్లు రికవర్ చేయాలంటే బ్లాక్ బస్టర్ కొట్టాలి గురూ.