చంద్రముఖి సినిమాలో ఓ సన్నివేశం. రజనీ ఎంట్రీని చూసిన ప్రభు.. ఇన్ని సంవత్సరాలైనా అంతే స్లిమ్ గా ఉన్నావ్ అంటాడు. దానికి తలైవా.. ''నువ్వు సన్నబడితే బాగుండదు.. నేను లావైతే బాగుండదు'' అని నవ్వులు పూయిస్తాడు. నిజంగా.. రజనీకాంత్ ఇంత వయసొచ్చినా అదే బాడీని మెయింటెయిన్ చేయడం గొప్ప విషయం. దాని వెనకున్న ప్రధాన సీక్రెట్ ఇదే!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా మార్నింగ్ వాక్ కంటిన్యూ చేస్తుంటారు రజనీ. లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రజనీ.. ఇలా మార్నింగ్ వాక్ కు వెళ్తూ కెమెరాకు చిక్కారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ వీదుల్లో ఆయన వ్యాయామం చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్-90 మాస్కు ధరించిన తలైవా.. టీషర్ట్, లోయర్ తో జామ్ జామ్ అంటూ వాకింగ్ కు వెళ్లిపోయారు. ఈ ఫొటో సోషల్ మీడియాలోకి రావడమే ఆలస్యం.. షేర్ల మీద షేర్లయిపోయింది. చూసిన వారంతా.. యంగ్ లుక్ లో రజనీ అదరగొడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఇక, రజనీ సినిమాల గురించి చూస్తే.. శివ దర్శకత్వంలో ''అన్నాత్తే'' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తలైవా హెల్త్ సమస్యలు, కరోనా నేపథ్యంలో ఆగుతూ.. సాగుతున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తయింది. వచ్చే దీపావళి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు