సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా యొక్క షూటింగ్ హైదరాబాద్ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. షూటింగ్ కు సంబంధించిన ఎలాంటి హడావుడి యూనిట్ సభ్యులు చేయకుండా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు.
తాజా షెడ్యూల్ ప్రారంభిస్తున్నట్లుగా కూడా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోతో మహేష్ బాబు సినిమా మళ్లీ షూటింగ్ జరుగుతుంది అన్నట్లుగా అభిమానులు ఒక అభిప్రాయానికి వచ్చారు.
ఎస్‌ఎస్‌ఎంబీ 28 చిత్రీకరణ గ్యాప్ లో త్రివిక్రమ్ యూనిట్ సభ్యులతో ఇలా క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మహేష్ బాబు సెట్స్ లో ఈ క్రికెట్ మ్యాచ్ జరిగినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి సినిమాకు సంబంధించిన వీడియో బయటకు రాకున్నా కనీసం ఇలా సెట్స్ లో యూనిట్ సభ్యులు క్రికెట్ ఆడుతున్న వీడియో బయటకు రావడంతో షూటింగ్ జరుగుతుంది అంటూ అప్‌డేట్ వచ్చిందని మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సుదీర్ఘ కాలం తర్వాత మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో శ్రీలీలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే ఈ సినిమాలోని ముఖ్య పాత్రకు రమ్యకృష్ణ ను ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ఆగస్టుకు వాయిదా వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Video Here >> https://youtube.com/shorts/skAyHk1p9BI?feature=share