చాలా సెలబ్రిటీల లవ్ స్టోరీలు పెళ్లికార్డుల వచ్చేస్తున్నా, అంతకుముందే మొదలైన కోహ్లీ, అనుష్కలు మాత్రం ఇంకా ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఇప్పటివరకూ తమ లవ్ ని బయటకు చెప్పలేదు, ఒప్పుకోలేదు వీరిద్దరూ. చూసేవాళ్లకు మంచి లవ్ స్టోరీ కనిపిస్తున్నా, పబ్లిక్ గానే ఫ్లయింగ్ కిస్ లు ఇచ్చుకున్నా.. సైలెంట్ సినిమానే చూపించారు. కానీ ఇప్పుడు ఒకేసారి ట్రెండ్ మార్చారు ఈ జంట.
ముంబైలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్యక్రమానికి చేతిలో చెయ్యి వేసి మరీ రెడ్ కార్పెట్ పై నడిచిన ఈ లవ్ పెయిర్.. అసలు విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఫంక్షన్ మొత్తం జోకులేసుకుంటూ ఎంజాయ్ చేసిన వీరు.. మధ్యలో హగ్గింగ్ సీన్స్ కూడా జనాలకు చూపించారు. గుడ్ లుకింగ్ కేండీ అంటూ విరాట్ కి అనుష్క కితాబిస్తే... లిటిల్ నీంబూ అంటూ తన బ్యూటీని పొగిడేశాడు కోహ్లీ.
ఇప్పటివరకూ తమ ఎఫైర్ పై పెదవి విప్పని విరాట్... తొలిసారి తన ప్రేమికురాలిని పబ్లిక్ గానే పొగిడాడు. అంతే కాదు... తామిద్దరూ ఉన్న ఫోటో ను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. దీంతో తమ రిలేషన్ ని వీరు మొదటిసారిగా ప్రపంచానికి చెప్పినట్లయింది. వీరి ఎఫైర్ పై ఎవరికీ అనుమానాలు లేకపోయినా, వాళ్లే కన్‌ఫాం చేయడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం.