కరోనా లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా గత నెలన్నర రోజులుగా ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నారు. ఎప్పుడు షూట్స్ అని.. మరేదో అంటూ బిజీ బిజీగా గడిపే సినిమా స్టార్స్.. ఎప్పుడూ ఏదో ఒక టోర్నమెంట్ తో బిజీగా ఉండే క్రికెటర్స్ కూడా ఇప్పుడు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. సెలబ్రెటీలు చిన్న చిన్న సందర్బాలను కూడా పెద్ద వేడుకలు చేసుకుంటూ ఉండేవారు. కాని లాక్ డౌన్ కారణంగా వేడుకలు అన్ని కూడా క్యాన్సిల్ అయ్యాయి.
నిన్న టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క శర్మ పుట్టిన రోజు. ఆమె బర్త్ డేను విరాట్ సింపుల్ గా చేశాడు. హోం మేడ్ కేక్ ను అనుష్క తో కట్ చేయించిన విరాట్ ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ ఫొటోను షేర్ చేసిన అనుష్క ఐ లవ్ యూ అంటూ కోహ్లీని ఉద్దేశించి తన ప్రేమను వ్యక్త పర్చుతూ కామెంట్ పెట్టింది.
సాదారణంగా అయితే విదేశాల్లోనో లేదంటే పెద్ద పార్టీగానో అనుష్క బర్త్ డే వేడుక జరిగేది. కాని క్వారెంటైన్ టైం కావడం తో పూర్తిగా ఇద్దరి మద్యే అది కూడా ఇంట్లో నాలుగు గోడల మద్యే ఈ సెలబ్రేషన్ జరిగింది. లవ్ కపుల్ విరుష్కల క్వారెంటైన్ సెలబ్రేషన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.