విరాట్ - అనుష్కలను కలిపింది అదే..!

Update: 2019-09-06 11:08 GMT
2013కు ముందు ముచ్చట ఇదీ.. టీమిండియా క్రికెటర్ గా ఫుల్ ఫామ్ లో బిజీగా ఉండే విరాట్ కోహ్లీ  ఒక వైపు.. బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాలతో బిజీగా ఉండే అనుష్క మరోవైపు.. ఇద్దరివీ భిన్న ధృవాలు.. భిన్న రంగాలు.. మరి వీరిద్దరు ఎలా కలిశారు.. ఎప్పుడు కలిశారు? వీరిద్దరిని కలిపింది ఏంటి అనేది ఆసక్తికర ప్రశ్న. ఈప్రశ్నకు తాజాగా సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ.

అనుష్కతో ప్రేమాయణం ఎలా మొదలైందో  చెప్పాడు టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అనుష్కను తొలిసారి విరాట్ చూసింది ఓ యాడ్ షూట్ లోనట.. ఓ షాంప్ యాడ్ లో విరాట్ - అనుష్క లు ఇద్దరు నటించారట.. అక్కడ చూసే అనుష్క ప్రేమలో విరాట్ పడిపోయాడట.. హై హీల్స్ వేసుకొచ్చిన అనుష్కపై సెటైర్ వేశాడట కోహ్లీ. సరదాగా కోహ్లీ వేసిన ఆ పంచ్ కు సీరియస్ అయ్యి వెళ్లిపోయిందట అనుష్క.

ఆ తర్వాత మెల్లిగా పరిచయం పెంచుకొని అనుష్క ప్రేమను గెలుచుకున్నాడట విరాట్. 2013లో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం 2017లో ఎండ్ అయ్యింది. ఇటలీలో దగ్గరి బంధువుల సమక్షంలో విరాట్-అనుష్క జంట వివాహం చేసుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్-క్రికెట్ ప్రేమికులైన కపుల్ గా దేశంలో ప్రఖ్యాతి పొందారు. ఇలా తమ ఇద్దరినీ కలిపింది షాంపూనే అని చెప్పుకొచ్చాడు విరాట్.
   

Tags:    

Similar News