లవ్ లో పడితే అంతే.. తెలుగు వాళ్ళకు 'ఈదు కరి రావిలుం ఒరు చెరు కసవిళ తుణ్ణుమ్ కిరణమే' అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. అర్థం కాలేదా.. ప్రేమలో పడినోళ్ళకు అర్థం అయితే కదా మీకు ఇది అర్థం అవ్వడానికి. అది 'బెంగుళూర్ డేస్' మలయాళం పాట. మలయాళం అయినా.. గుజరాతీ అయినా ప్రేమ పాట వినేందుకు మాత్రం ఎప్పుడూ హాయిగా ఉంటుంది.
విరాట్ కోహ్లి కి కూడా ఇలాంటి మలయాళం ప్రేమపాట ఏదో ఒకటి వినబడుతూ ఉన్నట్టుంది. అందుకనే తన వైఫ్ అనుష్క శర్మ పై ప్రేమను కురిపించాడు. ఇన్ స్టాగ్రామ్ లో అనుష్క ఫోటో ఒకటి పోస్ట్ చేసి ఇలా మెసేజ్ పెట్టాడు "అడ్డంకులను ఎదుర్కొంటూ ముందుకు నడిచేలా నిరంతరం నన్ను ప్రోత్సహించే వ్యక్తి. జీవితంలో ఇబ్బందులు ఎదురైనా మంచిదారిలో మాత్రమే వెళ్ళేలా నాకు దారి చూపించే వ్యక్తి. నిజమైన ప్రేమలోని శక్తిని తెలియజేసి నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి . నా బలం.. నా సోల్‌మేట్."
ఇంతకీ ఉన్నట్టుండి ఏంటి ఇలా.. అని మీకు అనుమానం వచ్చిందా? ఓకే.. విరాట్ కోహ్లి బుధవారం నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా 'ఖేల్ రత్న' పురస్కారం అందుకున్నాడు. దీంతో కాస్త ఎమోషనల్ అయిన కోహ్లి తన భార్య పై ఇలా ప్రేమను చాటుకున్నాడు. ఇక ఖేల్ రత్న విషయానికి వస్తే ఈ అవార్డు అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా కోహ్లి. గతంలో సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు.