అడవి బిడ్డల దారుణ హత్యలు .. పోలీసుల జులుం.. రగిలించే కొడవలి యుద్ధం.. ఎదురెళ్లే అన్నల విరవిహారం.. ఇందులోనే ఒక ఆడబిడ్డ ప్రేమకథ.. ప్రేమలో ఎమోషన్ .. యుద్ధంలో మోషన్.. ఉద్యమంలో ఎమోషన్.. ఇవన్నీ కలగలిపితే విరాటపర్వం ట్రైలర్. పచ్చని అడవుల్లో రావణకాష్టం ఎలా సాగింది? పోలీస్ వర్సెస్ నక్సల్స్ వార్ ఏ తీరుగా సాగింది? అన్నది ఆద్యంతం ఉత్కంఠను కలిగిస్తోంది.
ట్రైలర్ ఆద్యంతం సాయి పల్లవి - రానా మధ్య ప్రేమకథ మరో హైలైట్. వేణు ఉడుగుల మార్క్ పంచ్ పవర్ కూడా ఆకట్టుకుంది. చాలా కాలంగా రిలీజ్ ముంగిట ఉన్న ఈ మూవీ కరోనా వల్ల ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ వీక్షించాక కచ్ఛితంగా ఒక మాస్టర్ క్లాస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ ని వీక్షించగలమన్న భరోసా కనిపిస్తోంది. ముఖ్యంగా రానా నక్సల్ పాత్రకు పర్ఫెక్ట్ గా సూటవ్వగా .. అడవిలో అందమైన అమ్మాయిగా 90 ల బ్యాక్ డ్రాప్ యువతిగా తన నటన ఆద్యంతం రక్తి కట్టించబోతోందని అర్థమవుతోంది. ఇక లవ్ వర్సెస్ ఉద్యమం సంఘర్షణ తెరపై ఉత్కంఠను పెంచుతోంది. ఇక ప్రియుడితో కలిసి తుపాకి పట్టే యువతిగానూ ఎమోషన్ ని పతాక స్థాయికి తీసుకెళ్లింది సాయిపల్లవి. అలాగే నవీన్ చంద్ర పాత్రకు ఇందులో ఎంతో ప్రాధాన్యత కనిపిస్తోంది.
విరాట పర్వం జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే బోలెడంత ఆసక్తి నెలకొంది. టీమ్ దూకుడుగా ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ సినిమాలోని పాత్రల విషయానికొస్తే.. రానా తన కలం పేరు అరణ్యతో పిలువబడే కామ్రేడ్ రవన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి వెన్నెల అనే పాత్రలో కామ్రేడ్ కి ఆరాధకురాలిగా కనిపిస్తుంది. 1990ల నాటి వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందిన విరాట పర్వం యుద్ధ నేపథ్యంలో సాగే అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా చెబుతున్నారు. ముఖ్యంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ఆద్యంతం రక్తి కట్టిస్తుందని ఇంతకుముందు విడుదలైన విజువల్స్ వెల్లడించాయి. సాయి పల్లవి పాత్ర ఆద్యంతం ఎమోషనల్ గా కనిపించనుంది.
డి సురేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. డాని శాంచెజ్ లోపెజ్- దివాకర్ మణి సినిమాటోగ్రఫీని అందించగా.. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
విరాట పర్వం లో ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- జరీనా వహాబ్- ఈశ్వరీ రావు- సాయి చంద్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Full View