విభిన్నమైన చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నా లగడపాటి శ్రీధర్. ఆయన తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `వర్జీన్ స్టోరీ`. సౌమిక పాండియన్, రిషీ ఖన్నా, వినీత్ బవిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కాబోతోంది. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ని తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` చిత్రంలో విక్రమ్ సహిదేవ్ అన్వర్ అనే కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. కొంత విరామం తరువాత `వర్జీన్ స్టోరీ` మూవీతో హీరోగా పరిచయం అవుతున్నాడు. `కొత్తగా రెక్కలొచ్చెనా` అనేది క్యాప్షన్. ఫ్రెష్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ ని టార్గెట్ చేసి రూపొందించినట్టుగా తెలుస్తోంది.
`నువ్వు ఒకేసారి ఇద్దర్ని లవ్ చేస్తున్నావని అనుకుంటే ఆ రెండో పర్సన్ నే ఎంచుకో ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ని నిజంగా లవ్ చేసి వుంటే ఆ రెండో పర్సన్ ఉండే ఛాన్సే లేదు` అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పబ్ లో హీరోని చూసి నాయిక ఇంప్రెస్ అవడం.. ఆ తర్వాత వాళ్ల లవ్ జర్నీ మొదలవ్వడం.. చిన్న చిన్న అపార్థాలతో విడిపోవడం.. ఆ ఎడబాటుని విరహ వేదనగా చూపించిన తీరు.. ఇదే క్రమంలో హీరోయిన్ ఫ్రెండ్ `మనల్ని అబ్బాయిలు నెంబర్స్ లా చూస్తారు కానీ మనం నెంబర్స్ కాదని చెప్పే టైమ్ వచ్చింది` అంటూ చెప్పడం ఆకట్టుకుంటోంది.
సినిమా ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఫాస్ట్ కల్చర్ కి అలవాటు పడిన యువత ఎలా పెడదోవ పడుతున్నారో ఈ ట్రైలర్ లో చూపించారు. అపరిపక్వమైన ప్రేమలు, బంధాలని చూపిస్తూ ప్రేమ పేరుతో నేటి యువత పక్కదారి పడుతున్న తీరుని ఆవిష్కరించారు. రొమాంటిక్ అంశాలతో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సినిమా వుంటుందని తెలుస్తోంది. విక్రమ్ సహదేవ్ కి మంచి గుర్తింపుని అందించేలా ఈ మూవీ వుండబోతోందని చెబుతున్నారు.
Full View