విశాల్ పై .. అంత రిస్క్ చేస్తున్నారా?

Update: 2019-11-03 14:30 GMT
విశాల్ -త‌మ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `యాక్ష‌న్`. సుంద‌ర్.సి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. భారీ యాక్ష‌న్ ఛేజ్ లు.. రెండు దేశాల‌కు సంబంధించిన ఇంట‌ర్నేష‌న‌ల్ స‌మ‌స్య అంటూ విశాల్ ని పూర్తి యాక్ష‌న్ మోడ్ లోనే చూపించారు. ఆస‌క్తిక‌రంగా ఈ చిత్రంలో మిల్కీ వైట్ బ్యూటీ నెవ్వ‌ర్ బిఫోర్ అన్నంతగా యాక్ష‌న్ తో అద‌ర‌గొడుతోంది. ట్రైల‌ర్ తోనే బ‌జ్ పెరిగింది. ఆ క్ర‌మంలోనే బిజినెస్ డీటెయిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

యాక్ష‌న్ తెలుగు రైట్స్ ని అదేపు శ్రీ‌నివాస్ చేజిక్కించుకున్నారు. ఇందుకోసం రూ.8 కోట్లు వెచ్చించార‌ని చెబుతున్నారు. అయితే ఇంత  పెద్ద మొత్తం అంటే బిగ్ రిస్క్ అనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కూ త‌మిళ అనువాద చిత్రాల‌కు అంత పెద్ద సౌండ్ వినిపించ‌లేదు. విజిల్.. ఖైదీ లాంటి చిత్రాల‌కు పెద్ద బిజినెస్ చేశార‌ని ప్ర‌చార‌మైంది. వాటితో పోలిస్తే విశాల్ రేంజ్ ఎక్కువేన‌ని ఈ ఫిగ‌ర్ చెబుతోంది.

ఇక ఈ సినిమా మాస్ కి క‌నెక్ట‌య్యి బ్లాక్ బ‌స్ట‌ర్ అన్న టాక్ వ‌స్తేనే ఇంత పెద్ద మొత్తం రిక‌వ‌రీ చేయ‌గ‌లుగుతుంది. ఇటీవ‌లే విడుద‌లైన విజిల్ అటు త‌మిళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా తెలుగులో ఆశించినంత ఆడ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. కార్తీ నటించిన ఖైదీ సేఫ్ అయ్యి ఉత్స‌హం పెంచింది. అందుకే ఇప్పుడు విశాల్ పై పెడుతున్న మొత్తం తిరిగి రాబ‌ట్టాలంటే అది ఛాలెంజ్ తో కూడుకున్న‌దే అన్న విశ్లేష‌ణ సాగుతోంది. ఇంత‌కుముందు విశాల్ న‌టించిన `అభిమ‌న్యుడు` చిత్రం 9 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసింది. మ‌ళ్లీ ఆ స్థాయి విజ‌యం సాధిస్తేనే `యాక్ష‌న్` కి రిక‌వ‌రీ సాధ్య‌మ‌వుతుంది. న‌వంబ‌ర్ 15న ఈ సినిమా రిలీజ‌వుతున్న సంద‌ర్భంగా విశాల్ త‌మిళ్-తెలుగు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గానే వేచి చూస్తున్నారు.


Tags:    

Similar News