కోలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టకు ఆరంభంలోనే బ్రేక్ పడింది. కొరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్-కార్తి హీరోలుగా ఒక క్రేజీ మల్టీస్టారర్ అనౌన్స్ చేశారు కొన్ని నెలల కిందట. ఆ చిత్రానికి ‘కరుప్పు రాజా వెల్ల రాజా’ (నలుపు రాజా తెలుపు రాజా) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమా ఇక సెట్స్ మీదికి వెళ్లడమే తరువాయి అనుకుంటుండగా విశాల్.. కార్తి ఈ సినిమా నుంచి తప్పుకుని షాకిచ్చారు. ప్రభుదేవాతో వాళ్లిద్దరికీ పొసగలేదని.. స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందలేదని.. అందుకే ఈ సినిమా నుంచి వాళ్లు తప్పుకున్నారని అంటున్నారు. దీంతో ప్రభుదేవా ఈ సినిమా కోసం వేరే హీరోల పేర్లు పరిశీలిస్తున్నాడట.
నిజానికి ఈ చిత్రాన్ని విశాల్-కార్తి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం పారితోషకం లేకుండా పని చేయడానికి ముందుకొచ్చారు. అందుకు కారణం లేకపోలేదు. రెండేళ్ల కిందట నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్-కార్తి టీం ఘనవిజయం సాధించాక సంఘం కోసం భవనం నిర్మిస్తామన్న హామీ ఇచ్చారు. ఇందుకోసం ముందుగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించి రూ.9 కోట్ల దాకా నిధులు సమకూర్చారు. ఆ మొత్తం భవన నిర్మాణానికి సరిపోదని భావించి.. తామిద్దరం పారితోషకాలు లేకుండా ఓ సినిమా చేసి.. తమ వాటా కింద వచ్చే ఆదాయాన్ని నడిగర్ సంఘానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే ‘కరుప్పు రాజా వెళ్ల రాజా’ మొదలైంది. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమాకు బ్రేక్ పడింది.