విశాల్ నటించిన పందెంకోడి ఫ్రాంఛైజీగా రూపాంతరం చెందిందా? అంటే అవుననే లింగుస్వామి - విశాల్ & కో కన్ఫామ్ చేశారు. వాస్తవానికి పందెంకోడి సీక్వెల్ తీయాలని 13 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్న లింగుకి ఇన్నాళ్టికి వర్కవుటైంది. 13 ఏళ్ల పాటు గజినీ మహమ్మద్ లా దండయాత్ర చేసి ఇప్పటికి ఓకే చేయించుకోగలిగాడని - అసలు పందెంకోడి సీక్వెల్ అన్న ఆలోచన రాగానే లింగుస్వామిలో ఒకటే ఒణుకు పుట్టేదని విశాల్ తెలిపాడు. అంతేకాదు.. అలాంటి బ్లాక్ బస్టర్ కొట్టాలంటే అంతకు పదింతలు బెస్ట్ స్క్రిప్టు కావాలనే పందెంకోడి తర్వాత ఏడాదికోసారి లింగుస్వామి తన దగ్గరకు స్క్రిప్టు తెచ్చినా - ప్రతిసారీ తిరిగి వెనక్కి వెళ్లేవారని విశాల్ తెలిపారు. 12 సార్లు తిప్పి పంపాను. 13వ సారి స్క్రిప్టు ఓకే అయ్యింది. ఇది లింగుస్వామి దండయాత్ర అని అన్నారు విశాల్.
ఇకపోతే పందెంకోడి ఫ్రాంఛైజీ ఇకపైనా రన్ అవుతుందా? అన్నదానికి `పందెంకోడి 2` వేదికపై సమాధానం వినిపించింది. పందెంకోడి 2 ఈ అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నాం. తర్వాత పందెంకోడి 3 ప్రారంభిస్తున్నాం. పందెంకోడి 3లో కీర్తి సురేష్ ని కథానాయికగా ఫైనల్ చేసేశారు లింగుస్వామి. పందెంకోడి 4 - 5 చిత్రాల్ని ప్లాన్ చేస్తున్నామని విశాల్ స్వయంగా ప్రకటించారు. మొత్తానికి యాక్షన్ ప్యాక్డ్ ఫ్యాక్షన్ సినిమాల్ని విశాల్ - లింగుస్వామి బృందం ప్లాన్ చేసింది. ఇకపోతే పందెంకోడి 2 అటు తమిళ్ సహా తెలుగులోనూ భారీ రేంజులో బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నారు. వేదికపై మధు ఉల్లాసం ఉత్సాహం చూస్తుంటేనే తెలుగు వెర్షన్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం అవుతోంది. ఇక నేడు హైదరాబాద్ దసపల్లాలో జరిగిన టీజర్ లాంచ్ వేడుకలో టీమ్ మొత్తం పాల్గొంది.