ఎన్నికల బరిలోకి దిగిన విశాల్

Update: 2017-02-05 07:54 GMT
తమిళ సినీనటుడు విశాల్ సినిమా వార్తల్లోనే కాదు.. అందుకు భిన్నమైన చాలా వార్తల్లో వ్యక్తిగా తరచూ మీడియాలో కనిపిస్తుంటారు. సినిమాతో పాటు సినీ రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరించే విశాల్.. గత ఏడాది నడిగర్ సంఘం ఎన్నికల బరిలోకి దిగినప్పుడు ఆ ఎన్నికలు ఎంత హాట్ హాట్ గా మారాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఎంత హీట్ జనరేట్ అవుతుందో.. నడిగర్ ఎన్నికలు అంతేలా హీట్ జనరేట్ చేయటమే కాదు.. దక్షిణాది మొత్తాన్ని ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టేలా చేశాయని చెప్పాలి.ఎన్నికలే కాదు.. సామాజిక కార్యక్రమాల విషయంలోనూ విశాల్ వేగంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ మధ్య చెన్నై మహానగరానికి వరదలు వచ్చిన వేళ.. ఆయనెలా రియాక్ట్ అయ్యారో వార్తల్లో చూసిందే.

తాజాగా తమిళ నిర్మాత సంఘం ఎన్నికల బరిలోకి దిగారు విశాల్. ఆయనపై నిర్మాతల మండలి విధించిన సస్పెన్షన్ ను కోర్టు ఉత్తర్వులతో ఎత్తి వేయటంతో ఆయన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నిర్మాతలు ప్రకాశ్ రాజ్ తో పాటు.. ప్రముఖ నటులు కమల్ హాసన్ సహా పలువురు మద్దతు పలకటం ఆసక్తికరంగా మారింది.

వచ్చే నెల(మార్చి) 5న జరిగే ఈ ఎన్నికల్లో విశాల్ తో పాటు అధ్యక్ష పదవికి పోటీపడుతున్న వారిని చూస్తే.. కలైపులి ఎస్.థాను.. రాధాకృష్ణన్ లు ఉన్నారు. విశాల్ బరిలోకి దిగటంతో ఆయన వర్గం నుంచి పోటీకి దిగాలని భావించిన నటి ఖుష్బూ రేస్ నుంచి తప్పుకున్నారు. ఆమె సెక్రటరీ.. ట్రెజరర్ పదవులకు పోటీ పడే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండేళ్ల నుంచి బయట నుంచి తానుగళం విప్పినా పట్టించుకోవటం లేదని.. అందుకే తాను పోటీకి దిగినట్లుగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా తాను ఇచ్చిన హామీల్ని వెంటనే పూర్తి చేస్తానని.. లేకుండా తన పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్న విశాల్.. తన రాజీనామా లేఖను ఇప్పుడే ఇచ్చేస్తా అంటూ తన వైఖరిని స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి విశాల్ దిగటంతో తమిళనాడు నిర్మాతల మండలి ఎన్నికల సీన్ మొత్తం మారిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News