ఎన్టీఆర్‌ ప్లేస్‌ లో అతనే వందశాతం కరెక్ట్

Update: 2016-03-19 22:30 GMT
తెలుగులో పోలీస్ సినిమాలనగానే రాజశేఖర్ - సాయికుమార్ లాంటి హీరోలు గుర్తొచ్చేవారు ఒకప్పుడు. కానీ ఈ తరంలో అలా ఎవ్వరూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించలేదు. ఐతే తమిళంలో మాత్రం యంగ్ హీరోల్లో ఖాకీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు విశాల్. సెల్యూట్ - వేడి (తెలుగు శౌర్యంకు రీమేక్) - మగమహారాజు - జయసూర్య లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రలో అదరగొట్టాడు విశాల్. పోలీస్ పాత్రకు తగ్గ మ్యాన్లీ లుక్.. ఫిజిక్.. బాడీ లాంగ్వేజ్.. ఇమేజ్.. అన్నీ ఉన్నాయి విశాల్‌‌ కు. సరైన పోలీస్ క్యారెక్టర్ పడాలే కానీ.. విశాల్ చించేస్తాడని అతడి గత సినిమాలు రుజువు చేశాయి. తాజాగా ‘టెంపర్’ తమిళ రీమేక్‌ కోసం అతణ్నే హీరోగా ఎంచుకోవడం చాలా మంచి ఛాయిస్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది కోలీవుడ్ లో.

నిజానికి ఈ పాత్రకు ముందు శింబు పేరు తెరమీదికి వచ్చింది. ఐతే ఇంతకుముందే ఓసారి పోలీస్ పాత్ర చేసి చెడగొట్టాడు శింబు. ‘దబాంగ్’ రీమేక్ ‘ఓస్తి’ అక్కడ దారుణంగా తయారైంది. దీంతో ‘టెంపర్’లో మన ఎన్టీఆర్ అద్భుతంగా పోషించిన పాత్రను శింబు చేస్తాడనేసరికి మంచి అభిప్రాయం కలగలేదు. ఐతే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ‘టెంపర్’ రీమేక్ శింబు నుంచి విశాల్ చేతికి వచ్చింది. దయా పాత్రలో విశాల్ కనిపిస్తాడు అన్నాక .. జనాల ఫీలింగ్ మారిపోయింది. నిజంగానే దయ పాత్రను విశాల్ బాగా రక్తి కట్టించే అవకాశముంది. పోలీస్ పాత్రలంటేనే అతడికి కొట్టిన పిండి. ఇక దయా టైపులో ముందు కన్నింగ్ గా ఉండి.. తర్వాత రియలైజ్ అయ్యే పాత్ర అంటే విశాల్ కు బాగా సూటవుతుంది. ఈ పాత్రలో అతణ్ని ఊహించుకుంటే మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఎన్టీఆర్ తరహాలోనే కంపోజ్డ్ యాక్టింగ్‌ తో ఎమోషన్లు పలికించగల టాలెంట్ విశాల్ సొంతం. మంచి హీరో దొరికాడు కాబట్టి.. ‘టెంపర్’ను సరిగ్గా తీయాలే కానీ అక్కడ కూడా పెద్ద హిట్టవడం ఖాయం.
Tags:    

Similar News