టెంపర్‌ ను పూర్తిగా మార్చేస్తున్నాం

Update: 2018-10-27 16:51 GMT
తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టెంపర్‌’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. తమిళ రీమేక్‌ లో విశాల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ లో నట విశ్వరూపంను చూపించిన ‘టెంపర్‌’ చిత్రంను తమిళ నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేస్తున్నామని మొదట ప్రకటించిన విశాల్‌ - తాజాగా మాట్లాడుతూ ‘టెంపర్‌’ కథలో చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా ప్రకటించాడు. తెలుగు టెంపర్‌ కు తమిళంలో తాను చేస్తున్న రీమేక్‌ కు చాలా మార్పులు చేర్పులు ఉంటాయని విశాల్‌ పేర్కొన్నాడు.

‘పందెం కోడి 2’ చిత్రం సక్సెస్‌ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విశాల్‌ పలు విషయాలపై స్పందించాడు. విశాల్‌ మీటూ - తన ప్రేమ వ్యవహారం - రీమేక్‌ ల విషయం ఇలా అన్ని రకాల విషయాలపై మాట్లాడాడు. మొదట తన పందెంకోడి 2 చిత్రం సక్సెస్‌ నేపథ్యంలో సంతోషం ను వ్యక్తం చేశాడు. తన గత చిత్రాలు ఎ - బి సెంటర్లలో సక్సెస్‌ ను దక్కించుకుంది. కాని ఈ చిత్రం మాత్రం బి - సి సెంటర్‌ లలో మంచి ఆధరణ దక్కించుకుంది. మొత్తం 60 కోట్ల కలెక్షన్స్‌ ను రాబట్టిందని విశాల్‌ పేర్కొన్నాడు.

ఇక టెంపర్‌ రీమేక్‌ గురించి మాట్లాడుతూ గతంలో తాను ఎప్పుడు రీమేక్‌ చేయలేదు. మిర్చి- అత్తారింటికి దారేది చిత్రాల రీమేక్‌ ప్రపోజల్స్‌ నా వద్దకు వచ్చాయి. కాని ఆ చిత్రాలు చేస్తే తెలుగులో మార్కెట్‌ ఉండదనే ఉద్దేశ్యంతో వాటిని కాదన్నాను. కాని టెంపర్‌ రీమేక్‌ ను కాదనలేక పోయాను. సామాజిక అంశం ఉన్న సబ్జెక్ట్‌ అవ్వడం వల్ల టెంపర్‌ ను రీమేక్‌ చేసేందుకు ముందుకు వచ్చానంటూ విశాల్‌ పేర్కొన్నాడు. మీటూ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని, క్లైమాక్స్‌ చాలా అద్బుతంగా ఉంటుందని - ఊహించని విధంగా ఉంటుందని విశాల్‌ చెప్పుకొచ్చాడు.

ఇండస్ట్రీలో లైంగిక వేదింపులను తగ్గించేందుకు మహిళలతో ఒక కమిటీ వేశామని - ఆ కమిటీ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తుందని విశాల్‌ అన్నాడు. లైంగిక వేదింపులు ఎదురయ్యాయంటూ ఎవరైనా తమ వద్దకు వస్తే వెంటనే వారికి న్యాయం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నట్లుగా విశాల్‌ చెప్పుకొచ్చాడు. అమలాపాల్‌ విషయంలో వెంటనే స్పందించి న్యాయం చేశాం. అలాగే ఇంకా ఎవరైనా తమ వద్దకు వస్తే న్యాయం చేస్తామని విశాల్‌ అన్నాడు.

Tags:    

Similar News