తమిళనాట బీప్ సాంగ్ కలకలం సృష్టించింది. శింబు పాడిన ఆ పాటపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలు - అరెస్టుల వరకు వెళ్లింది వ్యవహారం. దీనిపై పలువురు పలు రకాలుగా స్పందించారు. సినిమా పరిశ్రమలోనే రెండు వర్గాలుగా విడిపోయి దీని గురించి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొన్నారు. శింబు తల్లిదండ్రులైతే కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వివాదంవల్ల మానసికంగా క్షోభకి గురయ్యామనీ, తమిళనాడుని వదిలిపెట్టి వెళ్లిపోతామని శింబు తల్లి మీడియా ముందు వాపోయారు. ఇప్పుడిప్పుడే ఆ వివాదం ఒక కొలిక్కి వస్తున్న క్రమంలో మరో విషయం చుట్టూ వివాదం అలుముకుంది. విశాల్ తన కొత్త సినిమాలో పలికిన కండోమ్ డైలాగే అందుకు కారణం. దాన్ని కూడా బీప్ సాంగ్ వివాదంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
విశాల్ కథానాయకుడిగా తమిళంలో కథకళి అనే చిత్రం తెరకెక్కింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. అందులో హీరోయిన్ తో కండోమ్ తీసుకో అని విశాల్ ఒక డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ కూడా అమ్మాయిల్ని కించపరిచేలా ఉందని కొద్దిమంది ఆరోపించారు. నడిఘర్ ఎన్నికల సమరం నుంచే విశాల్ పై గుర్రుగా ఉన్న రాధిక కూడా కండోమ్ డైలాగ్ ని తప్పుపట్టింది. అయితే విశాల్ మాత్రం ఆ వ్యాఖ్యల్ని కొట్టిపాడేశాడు. ``కండోమ్ అన్న మాట ఎందుకు తప్పవుతుంది అసలు? అది సెక్స్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. అయినా అలాంటి డైలాగులు ఏమైనా అభ్యంతరకంగా ఉంటే సెన్సార్ బోర్డు చూసుకొంటుంది. మిగతావాళ్లు ఎవ్వరూ దీనిపై జోక్యం చేసుకోవల్సిన అవసరం లేదు`` అని చెప్పాడు విశాల్.