తమిళనాడు ఎన్నికల్లోకీలకమైన పోలింగ్ కు సమయం దగ్గరకు వచ్చిన సమయంలో మూడు కంటైనర్లలో రూ.570 కోట్ల నగదును పోలీసులు గుర్తించటం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఈ భారీ మొత్తాన్ని పోలీసులు గుర్తించటం ఆసక్తికరంగా మారింది.
ఇన్ని వందల కోట్ల నగదు ఎవరికి సంబంధించిందన్న విషయం మీద పలు అభిప్రాయాలు వ్యక్తమువుతున్నాయి. ఇది ఎవరి సొమ్ము కాదని.. బ్యాంక్ సొమ్ము అన్న మాట ఓపక్క వినిపిస్తోంది. అయితే.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అంత పెద్ద మొత్తాన్ని బ్యాంకులు తరలిస్తాయా? అన్న సందేహాలు మరోవైపు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మీద ఓ పక్క హాట్ చర్చ జరుగుతుంటే.. మరోవైపు సెలబ్రిటీలు సైతం రియాక్ట్ కావటం గమనార్హం.
సామాజిక కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొనే యువ హీరో విశాల్ రూ.570 కోట్ల ఉదంతంపై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా రూ.570కోట్లు దొరకటం ఏమిటన్న విస్మయాన్ని వ్యక్తం చేసిన విశాల్.. ఆ మొత్తాన్ని చిన్నారుల విద్య కోసం.. మధ్యాహ్న భోజన పథకం కోసం వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. ఆ డబ్బు ఎక్కడిది? ఎవరిది అన్న అంశాల మీద స్సష్టత వస్తే బాగుంటుంది.