విశ్వక్ సేన్ ఆ స్టార్ డైరెక్టర్ ని అంత మాట అనేశాడేంటి..?

Update: 2020-04-02 06:18 GMT
తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకో స్టైల్, తన సినిమాల మీద ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్.. సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ తంటాలను కొని తెచ్చుకోవడంలో విశ్వక్ సేన్ సిద్ధహస్తుడు. ఏదనిపిస్తే అది మాట్లాడేసే మన ఫలక్ నుమా దాస్ ఈ మధ్య ఒక టీవీ షోలో నీకు నచ్చని మూవీ గురించి చెప్పమంటే టక్కున 'ఎఫ్2' అనేశాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది కానీ తానూ ఆ కామెడీని పావుగంటకి మించి చూడలేక వాకౌట్ చేసానని విశ్వక్ ఆ టీవీ షోలో చెప్పాడు.

ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని రకాల సినిమాల జోనర్ కే నేను వ్యతిరేకం. కమర్షియల్ అని పేరు పెట్టుకుని చేసే కొన్ని సినిమాల్లో ఏముంటుందో అర్ధం కాదు. ఎఫ్2 సినిమానే తీసుకుంటే ఆ సినిమాలో కథ ఏమీ లేదు. కమర్షియల్ సినిమా అర్ధం మార్చేస్తున్నారు తప్ప మరింకేమీ లేదు. కుళ్లు జోకులు ఉండే ఆ రకమైన సినిమాలకు నేను వ్యతిరేకం. అలాంటి సినిమాలు నేను చేయలేను. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ అలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం కూడా ఓ కళే. 100కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా అది. నా దృష్టిలో కేరాఫ్ కంచరపాలెం కమర్షియల్ సినిమా’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు విశ్వక్ సేన్ పై విమర్శలు చేస్తున్నారు. వెంకటేశ్ సినిమాను విమర్శించే స్థాయి నీకు లేదు, సీనియర్ హీరో అనే రెస్పెక్ట్ కూడా నీకు లేదు, నీకు ప్రమోషన్ చేసిన వెంకటేశ్ నే విమర్శిస్తావా.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే అనిల్ రావిపూడి తీసే సినిమాలు మూసగా ఉంటాయని మొదటి నుండి విమర్శలు వస్తుంటాయి కానీ ఇలా డైరెక్టుగా ఎవరు చెప్పలేదు. అయితే అనిల్ రావిపూడి సినిమాలకి విమర్శలు కొత్త ఏమీ కాదు కాబట్టి విశ్వక్ మాటలని అతను పట్టించుకోక పోవచ్చని సినీ అభిమానులు అనుకుంటున్నారు. కానీ వెంకటేష్ అభిమానులు హర్ట్ అయ్యి సోషల్ మీడియా ఎక్కితే మరోసారి సారీ చెప్తూ విశ్వక్ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది.
Tags:    

Similar News