దిల్ రాజు కి కమల్ ట్విస్ట్!

Update: 2018-07-24 06:42 GMT
ఇప్పుడు సినిమా తీయటం కంటే దాన్ని పోటీ లేకుండా విడుదల చేసి  జనంలోకి తీసుకెళ్లడమే ప్రహసనంగా మారింది. అందుకే దిల్ రాజు లాంటి సీనియర్ నిర్మాతలు ఇలాంటి విషయాల్లో పక్కా ప్లానింగ్ తో ఉంటారు. మన సినిమా మీద ఎంత నమ్మకం  ఉన్నా అవతలి పోటీ మూవీ మీద హైప్ కాస్త ఎక్కువగా ఉన్నా చాలు అది వసూళ్ల పై ప్రభావం చూపించేస్తోంది. ఆగస్ట్ 9ని రెండు నెలల ముందే లాక్ చేసుకుని తన శ్రీనివాస కళ్యాణంని రెడీ చేస్తున్న దిల్ రాజుకి ఒక్క రోజు తేడాతో ఆగస్ట్ 10న  అనూహ్యంగా కమల్ హాసన్ విశ్వరూపం 2 నుంచి పోటీ ఎదురుకావడం ఊహించని పరిణామమే. రెండు పూర్తి విరుద్ధమైన జానర్లే అయినప్పటికీ కాంట్రోవర్సీ మెటీరియల్ ఉన్న విశ్వరూపం 2 మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ప్రభావం చాలా ఉంటుంది.  విశ్వరూపం మొదటి భాగం తెలుగులో బాగానే ఆడిందన్న విషయం మర్చిపోకూడదు. అసలు కథ సెకండ్ పార్ట్ లోనే ఉంటుందని కమల్ ఇప్పటికే ఊరిస్తున్నాడు.

మరోవైపు క్లీన్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న శ్రీనివాస కళ్యాణం మీద ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. నితిన్ హీరో కావడంతో పాటు రాశి ఖన్నా గ్లామర్ మిక్కీ జె మేయర్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవే. సో ఇన్ని సానూకూలతలు ఉన్నా దిల్ రాజు ఇది సోలోగా వస్తే ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో పోటీ లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా కమల్ రూపంలో వచ్చేసింది. ప్రస్తుతానికి విశ్వరూపం 2 తెలుగు బయ్యర్లు ఖరారు కాలేదు. ఓ వారం అటు ఇటు ఎవరో ఒకరు తీసుకుంటారు. కానీ ప్రమోషన్ విషయంలో ఎలాంటి హడావిడి లేకుండా దీనికి ఓపెనింగ్స్ భారీగా సాధించడం అనేది అంతే ఈజీ కాదు. మరి కమల్ లాంటి సీనియర్ హీరో తో నితిన్ చేయబోయే బాక్స్ ఆఫీస్ ఫైట్ ఎలా ఉంటుందోనని సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News