`బాహుబలి` సినిమా తో పాన్ ఇండియా స్టార్లు గా వెలిగి పోయారు ప్రభాస్.. రానా. ఈ చిత్రంలోని పాత్రలకు తగ్గట్టుగా మాచో మ్యాన్ లుగా భారీ ఆకారం తో కనిపించడం కోసం డబుల్ బరువు పెరిగారు. ఒకరు బాహుబలిగా.. మరొకరు భళ్లాలుడి గా ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియుల్ని ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. `బాహుబలి` ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ క్రేజీ స్టార్స్ బరువు తగ్గుతున్నారు. గత కొంత కాలంగా టాలీవుడ్ హంక్ రానా బాగా బరువు తగ్గారు. చిన్న పాటి శస్త్ర చికిత్స వల్ల రానా షేప్ మారింది. దీనిపై ఇప్పటికే అభిమానుల్లో చర్చ సాగింది. ఇటీవల `మత్తు వదలరా` సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన రానా ఆ వీడియో లో చాలా బరువు తగ్గి కనిపించడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు నెటిజనుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
భళ్లాలుడు ఒక్కడేనా.. అంటే ఇప్పుడు.. బాహుబలి ప్రభాస్ బరువు తగ్గారు. ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రభాస్ తాజాగా పూర్తిగా రూపం మార్చుకోవడం ఫ్యాన్స్ కి షాకిస్తోంది. ప్రభాస్ మునుపటి కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. `మత్తు వదలరా` మంచి విజయం సాధించడంతో కీరవాణి వారసులు సింహా-భైరవలను అభినందిస్తూ ప్రభాస్ ఫొటోలకు పోజులిచ్చారు. ఇందులో ప్రభాస్ బరువు తగ్గి మరింత స్టైలిష్ గా కనిపిస్తున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రభాస్ ప్రస్తుతం `జిల్` ఫేమ్ రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న`జాన్` చిత్రం లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నారు. అందు కోసమే బరువు తగ్గారని చెబుతున్నారు. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా తరువాత సందీప్ వంగా డైరెక్ట్ చేయనున్న సినిమా లో ప్రభాస్ నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీస్ తో కలిసి టీసిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.