తళా అజిత్ చెలరేగితే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. గ్యాంబ్లర్, ఆరంభం, వివేకం (వివేగం) లాంటి చిత్రాలతో తమిళ తంబీలకే కాదు, తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. ఈసారి కూడా సంక్రాంతి బరిలో పందెంకోడిలా దిగాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఓవైపు తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో భారీ కాంపిటీషన్ నెలకొన్నా తళా ఆలోచన మాత్రం సంక్రాంతి అల్లుడు కావాలనేనట.
అందుకే పోటీలో ఎందరు ఉన్నా బస్తీ మే సవాల్ అంటూ ట్రైలర్ వదిలాడు. తాజాగా రివీలైన తళా `విశ్వాసం` ట్రైలర్ మాస్ మసాలా దమ్ కీ బిరియానీలా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీటిస్తోంది. యథావిధిగా ఇది కూడా మరో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమవుతోంది. తళా ఈ వయసులోనూ పందెంకోడిలా దూకుతున్నాడు. కత్తి చేతపట్టి ఊచకోత కోస్తున్నాడు. మరోవైపు నయన్ తో రొమాన్స్ అదరగొట్టేస్తున్నాడు. వచ్చీ రాని ఇంగ్లీష్ పీస్ మాట్లాడి బోలెడంత కామెడీనే చేస్తున్నాడు.
తెల్ల పంచె, పండిన తల, పండు రొయ్య మీసం.. గెటప్ ఎలా ఉన్నా కానీ తుక్కు రేగ్గొడుతున్నాడు. తూక్ తురుణి తళాంగు తళుకులే అంటూ ఇదివరకూ టీజర్ రిలీజ్ చేసిన్పడే తళా తూక్ తురుములే అనుకున్నాం. ట్రైలర్ తో మరోసారి మసాలా దట్టించి గుబులు రేపాడు. మాస్ యాక్షన్ సినిమాలు చూసేవాళ్లకు ఈ ట్రైలర్ గొప్ప విజువల్ ట్రీట్ అనడంలో సందేహం లేదు. అయితే అరవతంబీల అరవ వాసన కూడా అంతే బాగా దట్టించారని, విశాల్ `పందెంకోడి 2` తరహా కాన్సెప్టుతో వస్తున్నారని వేరొక కోణంలో అర్థమవుతోంది. కథపరంగా ఇన్నోవేటివ్ గా లేకపోతే తళా ఎంత ఇరగదీసినా జనం థియేటర్లకు రాకపోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంథా సినిమాలకు ఆదరణ దక్కుతోంది. ఇకపోతే రామ్‌చరణ్ `వినయ విధేయ రామ` పూర్తి మాస్ యాక్షన్ ఎటంటర్ టైనర్ కాబట్టి తళా పప్పులు ఉడుకుతాయా? అన్నది చూడాలి. ఇప్పటికైతే విశ్వాసం చిత్రం సంక్రాంతి బరిలో ఉంది అని ప్రకటించలేదు. మరి ఆ ప్రకటన కూడా వస్తుందేమో చూడాలి. అజిత్ - దరువు శివ కాంబినేషన్ భారీ హ్యాట్రిక్ కొట్టాలన్న జోష్ లో ఉన్నారు. వివేకం చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించింది.
Full View