యువ హీరో జేబు నింపిన 'వివాహ భోజనంబు'..!

Update: 2021-08-30 11:32 GMT
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రెండు చేతులా సంపాదించడం అలవాటు చేసుకున్నాడు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇంకోవైపు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి రెస్టారెంట్లు - సెలూన్లు నిర్వహిస్తున్నాడు. వెంకటాద్రి టాకీస్ బ్యానర్ పై సందీప్ కిషన్ నిర్మించిన ''వివాహ భోజ‌నంబు'' అనే చిత్రం ఇటీవలే సోనీ లివ్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హాస్య న‌టుడు స‌త్య ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన 'వివాహ భోజ‌నంబు' చిత్రం ఓటీటీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే ఈ సినిమా వల్ల నిర్మాత సందీప్ కిషన్ జేబు నిండినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనీ లివ్ ఓటీటీ సంస్థ వారు ఈ ఫస్ట్ తెలుగు సినిమాని ఒకటిన్నర కోటికి పైగా చెల్లించి తీసుకున్నారని టాక్. ఇక శాటిలైట్ రైట్స్ - ఆడియో హక్కులు వంటి ఇతర మార్గాల ద్వారా మ‌రో కోటిన్నర వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

మొతం మీద 'వివాహ భోజ‌నంబు' సినిమా మూడు కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రూ.1 కోటి ఖర్చు అయ్యుంటే.. పబ్లిసిటీ కోసం మరో అర కోటి పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ చూసుకుంటే సందీప్ కిషన్ యాభై శాతం లాభాలు అందుకున్నట్లే. కాకపోతే ఈ లాభాల్లో ఇతర నిర్మాతలకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ సందీప్ కే ఎక్కువ లాభం చేకూరింది.

ఎలా అంటే.. సందీప్ కిషన్ కు 'వివాహ భోజ‌నంబు' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అదే టైటిల్ తో సినిమా చేసి తన హోటళ్లకు కావాల్సినంత ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఏ విధంగా చూసుకున్నా సత్య తో చేసిన ప్రాజెక్ట్ సందీప్ ను లాభాల్లోకి తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతో యువ హీరో కమ్ ప్రొడ్యూసర్ మరో తన బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే రెండు చిత్రాలకి సంబంధించిన కథలు రెడీ అయిపోగా.. ఒక దాంట్లో సందీప్ హీరోగా నటిస్తారని టాక్. మరో సినిమాని మాత్రం బయటి హీరోతో చేసే అవకాశం ఉంది. ఇవి రెండింటినీ తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసి ఓటీటీకి అమ్మే ఆలోచన చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియనప్పటికి.. సందీప్ రెండు పడవల మీద నడుస్తూ రెంటినీ బ్యాలన్స్ చేసుకుంటున్నాడని చెప్పవచ్చు.

ఇక సందీప్ కిషన్ హీరోగా నటించే సినిమాల విషయానికొస్తే.. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన 'గల్లీ రౌడీ' సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. ఇదే క్రమంలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి తో కలిసి సందీప్ 'మైఖేల్' అనే ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజిత్ జయకోడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ లో యువ హీరో ఓ సినిమా చేయనున్నాడు. అలానే రాజ్ అండ్ డీకే రూపొందించే 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్ లో సందీప్ కీలక పాత్ర పోషించనున్నాడు.
Tags:    

Similar News