ఓటీటీలో 'వివాహ భోజనంబు'.. కన్ఫార్మ్ చేసిన సందీప్ కిషన్..!

Update: 2021-08-04 01:30 GMT
కరోనా నేపథ్యంలో అనేక సినిమాలు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ రిలీజ్ అయ్యాయి. టాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇప్పుడు థియేటర్లు తెరిచినా కూడా ప్రేక్షకుకు సినిమా కోసం వస్తారో లేదో అనే సందేహంతో కొందరు ఫిలిం మేకర్స్ ఓటీటీ విడుదలకే మొగ్గుచూపుతున్నారు. ఇటీవల 'నారప్ప' లాంటి పెద్ద సినిమా కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయింది. ఈ క్రమంలో 'వివాహ భోజనంబు' అనే మరో తెలుగు సినిమా కూడా ఓటీటీ బాట పడుతోంది.

ప్రముఖ హాస్యనటుడు సత్య ని హీరోగా పరిచయం చేస్తూ యంగ్ హీరో సందీప్ కిషన్ రూపొందించిన సినిమా ''వివాహ భోజనంబు''. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో సందీప్ కిషన్ కనిపించనున్నారు. అర్జావీ రాజ్ హీరోయిన్ గా నటించింది. లాక్‌ డౌన్‌ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో రేపు (ఆగస్టు 4) సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ ట్వీట్ చేస్తూ.. ''వివాహ భోజనంబు'' చిత్రాన్ని సోనీ లైవ్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సోనీ లైవ్ లో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ ఇదేనని చెప్పడానికి సంతోషిస్తున్నానని సందీప్ పేర్కొన్నారు. కాగా, కరోనా టైంలో కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసుకున్న పిసినారి మహేష్ (సత్య).. లాక్‌ డౌన్ పెట్టడంతో తన ఇంటికి వచ్చిన చుట్టాలను పోషించడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడనేది ఈ చిత్రంలో ఫన్నీగా చూపించబోతున్నారు.

వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్ - సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె.ఎస్. శినీష్ - సందీప్ కిషన్ సంయుక్తంగా ''వివాహ భోజనంబు'' చిత్రాన్ని నిర్మించారు. సుదర్శన్ - శ్రీకాంత్ అయ్యంగార్ - టి.ఎన్.ఆర్ - ‘వైవా’ హర్ష - మధుమని - నిత్య శ్రీ - కిరీటి తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భాను భోగవరపు స్టోరీ అందించగా.. నందు ఆర్.కె డైలాగ్స్ రాశారు. అనివీ సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.


Tags:    

Similar News