ఈమద్య కాలంలో రీమేక్ లు ఎక్కువ అయ్యాయి. మన తెలుగు లో ఇతర భాషల సినిమాల రీమేక్ లు కాదు.. మన తెలుగు సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం. తెలుగు సినిమాలు హిందీలో ఈమద్య కాలంలో ఎన్ని రీమేక్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో తెలుగు సినిమాలు రీమేక్ అయ్యి వందల కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తూ దుమ్ము రేపుతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాను అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా చాలా చోట్ల రీమేక్ లు చేస్తున్నారు. బాహుబలి సినిమా తో తెలుగు సినిమాకు పాన్ ఇండియా గుర్తింపు లభించింది. అయితే తెలుగు సినిమా బాహుబలి మాదిరిగా డబ్బింగ్ అయినా అయ్యి అన్ని భాషల్లో అలరిస్తుంది.. లేదంట అర్జున్ రెడ్డి మాదిరిగా రీమేక్ అయ్యి అయినా ఎంటర్ టైన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు నుండి ఎన్ని సినిమాలు రీమేక్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సమయంలో మరో సినిమా కూడా రీమేక్ కు సిద్దం అయ్యింది. యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి కరోనా లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కి ఇటీవలే డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివాహ భోజనంబు సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు గాను రీమేక్ రైట్స్ ను జ్ఞానవేల్ రాజా తీసుకున్నాడట. కమెడియన్ సత్య తెలుగు లో ప్రథాన పాత్రలో నటించాడు. సొంత ఇంటి కళను నెరవేర్చుకునేందుకు పైసా పైసా కూడబెట్టేందుకు హీరో చాలా పిరిసినారిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి పిసినారి హీరో ఇంట్లో పెళ్లి వారు కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా రోజులు ఉండాల్సి వస్తుంది. ఆ రిచ్ ఫ్యామిలీకి మనోడి పిసినారి వంట వార్పులు మరియు ఇతర విషయాల్లో మర్యాదలు ఎలా సాగుతాయి.. వారిని పంపించేందుకు అతడు చేసే ప్రయత్నాలు ఏంటీ అనేది సినిమా కథాంశం.
సింపుల్ కథను మంచి స్క్రీన్ ప్లే మరియు ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు రామ్ అబ్బరాజు చక్కగా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా రీమేక్ చేయడం కోసం రైట్స్ తీసుకున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ చెప్పడం జరిగింది. తమిళంలో ఈ సినిమా ను రీమేక్ చేస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది అనే టాపిక్ వస్తే ఎక్కువ శాతం మంది అక్కడ ప్రస్తుతం టాప్ స్టార్ కమెడియన్ అయిన యోగి బాబు వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా అతడికి ఈ సబ్జెక్ట్ యాప్ట్ అవుతుందని అంటున్నారు. కరోనా నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మొదటి తెలుగు సినిమా ఇదే. అలాంటి సినిమా ను తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇప్పటికే మన తెలుగు సినిమాలను చాలా రీమేక్ చేసేందుకు తీసుకున్నారు. ఇప్పుడు ఈ చిన్న సినిమాను కూడా రీమేక్ చేసేందుకు తీసుకోవడం అంటే మన సినిమాలపై ఇతర భాషల వారికి ఎంతటి గురి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.