అజిత్ - ఈ పేరు వింటే చాలామంది తమిళ ప్రేక్షకులు పూనకం వచ్చినట్టు ఊగిపోతారు. రీసెంట్ గా తన 25 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అజిత్ కెరీర్ లో జయపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అలాగే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేలా తనకంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆగస్టు 24న "వివేగం" అనే సినిమాతో మరోసారి దండ యాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాకు పని చేసిన ఎడిటర్ ఆంటోనీ ఎల్ రూబెన్ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. నెక్స్ట్ వీక్ రాబోతున్న అజిత్ "వివేగం" సినిమా అందరిని ఆకట్టుకుంది అని చెప్పి.. బాహుబలి స్థాయిలో ఉంటుందని వివరించాడు. ఆయన మాట్లాడుతూ.. వివేగం సినిమాలోని కొన్ని విజువల్స్ పరంగా బాహుబలి చిత్రంలో ఉన్నట్టుగానే ఉంటాయని తెలిపాడు. అలాగే టెక్నీకల్ పరంగా గాని కొన్ని గ్రాఫిక్స్ వర్క్స్ లో గాని వివేగం సినిమాలో ఎస్ ఎస్ రాజమౌళి మేకింగ్ స్టయిల్లో ఉంటుందని ఎడిటర్ తెలిపాడు. ఇక వివేగం యూత్ నే కాకుండా అన్ని వర్గాల తమిళ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే దర్శకుడు శివ ఎంతో జాగ్రతగా సినిమాను తెరకెక్కించడాని తెలుస్తోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబో లో వచ్చిన వేదాళం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో వివేగం కూడా హిట్ అవుతుంది అంటున్నారు.
అంతా బాగానే ఉంది కాని.. అసలు అజిత్ సినిమాలో గ్రాఫిక్స్ ను బాహుబలితో పోల్చడమే ఇప్పుడు కామెడీగా ఉందంటున్నారు సినిమా జనాలు. గన్నులు.. చేజులూ.. ఫైట్లు.. ఇలాంటివన్నీ మనోళ్ళు ఎప్పటినుండో చేస్తున్నారు. అవన్నీ బాగానే ఉంటున్నాయి. కాని బాహుబలి రేంజ్ అంటే అది వేరే. అలాంటిది ఒక రియల్ లైఫ్ మూవీని ఫాంటసీ ఎపిక్ తో పోల్చి చూడడం పెద్దగా సింక్ అవ్వట్లేదు ఎడిటర్ సాబ్.