ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గురించి గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వ ంలో ఈ బయోపిక్ తెరకెక్కనుందని, వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర పోషిస్తారని ప్రచారమైంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీగా ఒబేరాయ్ లుక్ ఎలా ఉంటుందో పోస్టర్ ద్వారా రివీల్ చేసారు.
తొలి పోస్టర్ ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లాంచ్ చేశారు. మొత్తం 23 భాషల్లో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ వివరాల్ని ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ``వివేక్ ఆనంద్ ఒబేరాయ్ ( వివేక్ ఒబేరాయ్) నరేంద్ర మోదీ బయోపిక్ లో నటిస్తున్నారు. టైటిల్ పీఎం నరేంద్రమోదీ. 23 భాషల్లో ఈ చిత్రం వస్తుంది. అన్ని భాషల్లో పోస్టర్లను సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లాంచ్ చేశారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సురేష్ ఒబేరాయ్ - సందీప్ సింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు`` అని తెలిపారు.
ఒబెరాయ్ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. నరేంద్ర మోదీ సిగ్నేచర్ స్టైల్ కి ఒబేరాయ్ పెర్ఫెక్ట్ గా సూటయ్యాడంటూ ఫ్యాన్స్ కితాబిస్తున్నారు. పరిశ్రమ వర్గాల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. ఒబేరాయ్ ఇదివరకూ రక్త చరిత్ర చిత్రంలో ఫ్యాక్షనిస్ట్ - తేదేపా నాయకుడు పరిటాల రవి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరోసారి నరేంద్ర మోదీ బయోపిక్ తో వాడి వేడిగా చర్చల్లోకొచ్చాడు. చరణ్ `వినయ విధేయ రామ` చిత్రంలోనూ ఒబేరాయ్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.