బాలీవుడ్ హీరో కం విలన్ వివేక్ ఓబెరాయ్ గురించి పరిచయం అవసరం లేదు. ఉత్తరాది బిజీ నటుల్లో ఆయన ఒకరు. తెలుగులో 'రక్త చరిత్ర'..' వినయ విధేయ రామ' లాంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో మెప్పిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ నయా హీరో ఓటీటీ సహా బాలీవుడ్ వారసుల్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓటీటీ వేదిక స్వేచ్ఛా..ప్రజాస్వామ్యం నాకు బాగా నచ్చుతున్నాయి.
ఇది కలకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఓటీటీలో ప్రతిభ ఒక్కటే కొలమానం. ఇక్కడ నువ్వు ఎవరు? ఎవరి వారసుడివి? అనే విషయాలు పట్టించుకోరు. మనలో మ్యాటర్ ఉందా? లేదా? అన్నదే చూస్తారు. ప్రతిభ..పనితనం ఉంటే ప్రశంసలు దక్కుతాయి. అవకాశాలు వస్తాయి. ఇక్కడ ఎన్నిచిత్రాలైనా ఇష్టానుసారం రిలీజ్ చేసుకోవచ్చు అడ్డు చేప్పేది ఉండదు.
ఎవరైనా అడ్డుగా నుంచున్నా తోసుకుని ముందుకెళ్లిపోవచ్చు. ప్రచారం మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అలాగే లాబీయింగ్ కి ఆస్కారం లేదు. బలవంతుల ఆటలు ఇక్కడ పనిచేయవు' అన్నారు. 'ఇన్ సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్ కార్యక్రమాలో వివేక్ ఓబెరాయ్ ఈ వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఆయన మాటలు వెనుక చాలా అర్ధాలు ఉన్నాయంటూ విశ్లేషణ సాగుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరోల్ని టార్గెట్ చేసి వ్యాఖ్యానించినట్లు కనిపిస్తుంది. ఓటీటీ వచ్చి చాలా కాలమవుతున్నా...ఎప్పుడు చేయనటి వంటి వ్యాఖ్యలు ఇప్పుడే పనిగట్టుకుని..అదీ ఓటీటీని అడ్డు పెట్టుకుని మాట్లాడటం వెనుక ఇంకేదో అర్ధం ఉందంటూ ప్రత్యేక కథనాలు వైరల్ అవుతున్నాయి.
వివేక్ ఓబెరాయ్ కూడా బాలీవుడ్ వారసుడే. ప్రముఖ నటుడు..రాజకీయ వేత్త సురేష్ ఓబెరాయ్ తనయుడిగా వివేక్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసారు. కానీ తండ్రి ప్రభావం వివేక్ పై అంతగా లేదు. నటుడిగా వివేక్ స్వయంకృపారాధంతోనే ఎదిగాడు. ప్రతిభ తోనే నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివేక్ పైనా బాలీవుడ్ లో కొందరు వారసులు విషం చిమ్మిన సందర్భాలున్నాయి. వాటన్నింటిని దాటుకుని వివేక్ నిలబడ్డారు. వాటికి ప్రతిగానే వారసులపై వివేక్ ప్రతిస్పందించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వివేక్ ఓబెరాయ్ 'ధారావి బ్యాక్' అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.