నా కొడుకును టీవీల్లో చూపించొద్దు-వివేక్

Update: 2015-10-30 11:14 GMT
వివేక్.. ఈ పేరు చెబితే చాలు తమిళ ప్రేక్షకుల ముఖాల్లో ఆటోమేటిగ్గా నవ్వు పులుముకుంటుంది. రెండు దశాబ్దాలకు పైగా తమిళ తెరను నవ్వుల మయం చేస్తున్న కమెడియన్ వివేక్. ముఖ్యంగా 1995-2005 మధ్య కోలీవుడ్ లో నెంబర్ వన్ కమెడియన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు వివేక్. తనదైన కామెడీ టైమింగుతో అద్భుతమైన కామెడీ పండించిన వివేక్ తెలుగు ప్రేక్షకులకూ బాగానే పరిచయం. ఐతే ఆ కమెడియన్ ఇప్పుడు పుట్టెడు దు:ఖంతో ఉన్నాడు. వివేక్ 13 ఏళ్ల కొడుకు ప్రసన్న నిన్న అనారోగ్యంతో మృతి చెందాడు.

దాదాపు నెల రోజుల నుంచి బ్రెయిన్ ఫీవర్ తో బాధపడుతున్న ప్రసన్న నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా అతను చికిత్సకు స్పందించలేదు. కొన్ని నెలల ముందు వరకు ప్రసన్న బాగానే ఉన్నాడు. తండ్రితో కలిసి ఓ ఫంక్షన్ లో పాల్గొన్న ఫొటో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇంతలోనే అతను అనారోగ్యం పాలై.. చనిపోయాడు. నవ్వులు పంచే తండ్రికి విషాదం మిగిల్చాడు. ప్రసన్న కంటే ముందు వివేక్ కు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. తన కొడుకు మరణంతో తాను శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉన్నానని.. దయచేసి ఈ సమయంలో మీడియా వాళ్లు తనతో, తన కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని.. అంతే కాక తన కొడుకు మృతదేహాన్ని - ఇంటి దగ్గరి దృశ్యాల్ని - అంత్యక్రియల్ని టెలికాస్ట్ చేయొద్దని విజ్నప్తి చేశాడు వివేక్. ఆయన మాటల్ని గౌరవించి.. మీడియా వాళ్లు వివేక్ కొడుకు మృతదేహాన్ని చూపించట్లేదు.
Tags:    

Similar News