ఓటు విలువ గురించి ప్రభుత్వాలు ఎంత భజన చేసినా ఎవరూ పట్టించుకోరు. ఓటు హక్కు వినియోగం పై ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ వీడియో ప్రకటనల్ని రూపొందించి ప్రచారం చేస్తోంది. అయినా మాస్ కి ఇలాంటి వీడియోలు ఎక్కుతాయా? అయితే ఓటు ప్రయోజనాన్ని జనాలకు చెప్పి కన్విన్స్ చేసి పోలింగ్ బూత్ వరకూ తీసుకొచ్చే ప్రహసనాన్ని కొందరు సెలబ్రిటీలు తలకెత్తుకోవడం ప్రశంసించదగిన పరిణామం.
ఇటీవల ప్రజల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదివరకటిలా 40-50శాతం జనం ఓట్లు వేసే రోజు బయటకు రాకపోవడం అన్నది ఉండదని అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఈ బాపతు జనాల్ని బయటకు రమ్మని ఓటు వేయమని సెలబ్రిటీలు పదే పదే విన్నవిస్తున్నారు. అందుకోసం పలు టీవీ చానెళ్ల వేదికగా బైట్స్ దర్శనమివ్వడం కొంతలో కొంత బెటర్ రిజల్ట్‌కి తావివ్వనుంది.
ఈ సీజన్‌లో ఓటేయండి మహాప్రభో! అని జనాలకు విన్నవించిన సెలబ్రిటీల పేర్లు పరిశీలిస్తే.. టాప్ 10 జాబితాలో నాగార్జున, అమల, దేవరకొండ, డి.సురేష్‌బాబు, సుమంత్, శ్రీకాంత్, ఉపాసన తదితరులు ఉన్నారు. వీళ్లంతా సామాజిక మాధ్యమాల్లో ఓవైపు ఓటు హక్కు సద్వినియోగంపైనా ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ తరహా ప్రచారంలో అక్కినేని కాంపౌండ్ మరో ముందడుగు వేసి తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది.
కింగ్ అక్కినేని నాగార్జున స్వయంగా ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి పెట్టారు. నేను ఓటు వేసేందుకు వెళుతున్నా.. మీ సంగతేంటి? అంటూ జీహెచ్ఎంసీ రూపొందించిన వీడియోని నాగార్జున ట్విట్టర్‌లో అభిమానులకు చేరవేసారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటేయండి.. మేం ఓటేసేందుకు వెళుతున్నాం.. మీరు వెళుతున్నారా? అంటూ నాగ్, అమలా ఈ వీడియోల్లో ప్రచారం చేశారు. ఇదివరకూ శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ సైతం ఓటేయడం మన బాధ్యత అని ఓటర్లకు గుర్తు చేశారు ఓ ప్రచారకార్యక్రమంలో. శ్రీకాంత్ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ జీవితకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరో సుమంత్ సైతం ఇటీవల `సుబ్రమణ్యపురం` ఇంటర్వ్యూల్లో ఓటు హక్కును యూత్ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తాను అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నానని తెలిపారు.
దేవరకొండ ఈసారి నా ఓటును కచ్ఛితంగా తేరాసకు వేస్తానని కేసీఆర్-కేటీఆర్ పై బహిరంగంగానే తన అభిమానం చాటుకున్నాడు. నాయకుడు నచ్చక ఓటు వేయకపోయినా నోటా నొక్కండి అని ప్రచారం చేశాడు. వీళ్లందరి కంటే `సర్కార్` సినిమాతో ఇలయదళపతి విజయ్ ఓటు హక్కు విలువను పెద్ద తెరపైనే మాబాగా చెప్పాడు. దొంగవోట్ల ప్రాపకం దేశాన్ని ఎలా దుర్మార్గుల పాల్జేస్తోందో చూపించాడు. టాలీవుడ్ హీరోలు, అగ్రనిర్మాతలు సహా పలువురు టాప్ సెలబ్రిటీలు టీవీ మీడియా బైట్స్‌లో ఓటు గురించి ప్రచారం చేయడం జనాల్లో మార్పు తెస్తుందనే ఆశిద్దాం.