'గని' మూవీలో బాక్సర్ గా నటించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. కఠోరంగా శ్రమించి బాక్సర్ గా ట్రాన్స్ ఫామ్ అయి రిస్క్ చేసినా ఈ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ ని తీవ్ర నిరాశకు గురిచేయడమే కాకుండా భారీ డిజాస్టర్ గా నిలిచి దారుణ ఫలితాన్ని అందించి తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. దీంతో కొంత విరామం తీసుకున్న వరుణ్ తేజ్ ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు సంబంధించిన కథతో భారీ మూవీకి శ్రీకారం చుట్టాడు.
సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ మూవీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా లాంఛనంగా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. అంతే కాకుండా ఈ మూవీ ద్వారా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
వరుణ్ తేజ్ నటిస్తున్న 13వ ప్రాజెక్ట్ ఇది. VT 13 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ రెగ్యేలర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జక జకా జరుగుతున్నాయి. ఇదొక యాక్షన్ డ్రామా. గతంలో అభినందన్ వర్థమాన్ అనే ఏయిర్ ఫోర్స్ కి చెందిన ఏయిర్ మార్షల్ పాక్ పై చేసిన సంచలన దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న సినిమా ఇది. దేశ భక్తి నేపథ్యంలో సాగే సినిమా ఇది.
వైమానిక దాడి, ఆ సమయంలో ఏయర్ ఫోర్స్ హీరోల పాత్ర, ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటి సాహసాలకు పూనుకుంటారు? .. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే సవాళ్లేంటి? దఏశం కోసం వారు చేసే త్యాగాలు ఎలా వుంటాయనే నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ మూవీ ద్వారా చూపించబోతున్నారు. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడని ఏర్ ఫోర్స్ విన్యాసాల సమాహారంగా ఈ సినిమా వుంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా శనివారం భారత వైమానిక దళ దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్ ని విడుదల చేసింది. హీరో వరుష్ తేజ్ జెట్ ఫైటర్ వైడు ఠీవీగా అడుగులు వేస్తూ నడుస్తున్నటాప్ యాంగిల్ స్టిల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని ఎంత భారీ స్పాన్ లో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారో ఈ స్టిల్ స్పష్టం చేస్తోంది.
సినిమాలో వరుష్ తేజ్ ఐఏఎఫ్ అధికారిగా భిన్న పార్శాల్లో సాగే పాత్రలో కనిపించబోతున్నాడు. డిసెబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.