కంటెంట్ లో వల్గారిటీ ఉండాల్సిందేనా?

Update: 2019-09-02 09:37 GMT
సినిమా అంటేనే బిజినెస్. ఏ ఉద్దేశంతో తీసినా ఎవరితో చేసినా అల్టిమేట్ గా దర్శక నిర్మాతల అంతిమ లక్ష్యం లాభాలు చూడటం. అది జరగనప్పుడు ఫ్లాప్ కిందకే లెక్క వేస్తారు. అయినప్పటికీ తెలుగు సినిమా పరంగా మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాటికి లోబడి తీస్తేనే ప్రేక్షకుల ఆమోదం కలకాలం కాస్తంత మంచి పేరు ఉండిపోతుంది. కాని ఇప్పటి కొందరు మీడియం మరియు లో బడ్జెట్ నిర్మాతల ఆలోచన ధోరణి అలా లేదు.

అవసరానికి మించిన ముద్దు సీన్లు - హీరొయిన్ చేత పదే పదే ఎక్స్ పోజింగ్ చేయించే సీన్లు రాసుకోవడం - బెడ్ రూమ్ లో ప్రైవేటుగా నడిపించాల్సిన శృంగారాన్ని బోల్డ్ నెస్ పేరుతో మొహమాటం లేకుండా తెరమీద చూపించేయడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోయింది.  ఇక్కడ ఇలాంటివి తీస్తున్న వాళ్ళ ఉద్దేశంలో రూపాయికి రెండు లేదా మూడు రూపాయలు ఎలా సంపాదించుకోవాలి అన్న యావ తప్ప ఇంకేమి కనిపించదు.

దురదృష్టవశాత్తు ఈ ఉచ్చులో కొందరు సీనియర్ నిర్మాతలు కూడా పడి అలాంటి కథలను ఎంకరేజ్ చేయడం దురదృష్టం. వీటి ట్రైలర్లు టీజర్లు టీవీలోనో ల్యాప్ టాప్ లోనో వస్తే పిల్లలున్నప్పుడు కళ్ళు మూయల్సిన పరిస్థితి వస్తోంది. మెచ్యురిటి పేరిట అర్థం లేని మసాలా సినిమాలు తీస్తే వాళ్ళకు నాలుగు డబ్బులు రావొచ్చు గాక. దీన్నే మరికొందరు స్ఫూర్తిగా తీసుకుని ఫ్యూచర్ లో ఇలాంటి సినిమాలు ఎక్కువగా తీయడం మొదలుపెడితే రేపటి తరం ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అంత పరిణితి ఇలాంటి మేకర్స్ నుంచి ఆశించడం దురాశే


Tags:    

Similar News