సూపర్‌ క్లాస్ హీరో.. మాస్‌ డైరెక్షన్‌ లో!

Update: 2015-08-30 14:27 GMT
మహేష్‌ ని చూడగానే క్లాస్‌ హీరో అని ఫిక్సయిపోవాల్సిదే. స్మార్ట్‌ లుక్‌, స్టయిలిష్‌ అప్పియరెన్స్‌ అతడికి ఆ ఇమేజ్‌ ని వద్దనుకున్నా తెచ్చి పెట్టేశాయి. భాషలోని యాసతో నేనూ మాస్‌ నే అని ప్రూవ్‌ చేసుకున్నాడు కానీ, రూపురేఖల దృష్ట్యా అతడు పక్కా క్లాస్‌ హీరో. అలాంటి క్లాస్‌ హీరో ఇప్పుడు ఓ మాస్‌ డైరెక్టర్‌ తో పని చేయడానికి సిద్ధపడ్డాడంటే సంథింగ్‌ ఈజ్‌ దేర్‌ అనే అనుకుంటున్నారంతా. ఇంకాస్త డీటెయిల్డ్‌ గా వెళితే..

మహేష్‌ హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌ కెళ్లనుందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. అతడు ఓ ఫాంటసీ సినిమాలో నటించాలనుకుంటున్నాడు.  పైగా వినాయక్‌ లాంటి మాస్‌ డైరెక్టర్‌ అయితే బావుంటుందుని భావిస్తున్నాడు. ఇప్పటికే వినాయక్‌ అఖిల్‌ ని ఫాంటసీ జోనర్‌ చూపిస్తున్నాడు. మహేష్‌ ఆలోచనతో సింక్‌ కుదిరింది అక్కడే. వినాయక్‌ సైతం దాదాపు 100కోట్ల బడ్జెట్‌ తో మహేష్‌ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

అందుకోసం ఇతర సినిమాల్ని పక్కన పెట్టేసి ప్రిన్స్‌ కోసం కథ రెడీ చేస్తున్నాడుట. మరి నిర్మాత ఎవరు? ఇంత క్రేజీ కాంబినేషన్‌ లో సినిమా అంటే ఎవరైనా ముందుకొస్తారు. మెగా ప్రొడ్యూసర్‌ డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. ముందు కథ రెడీ అవ్వాలి. వినాయక్‌ ప్రిన్స్‌ కి వినిపించి ఓకే చేయించుకోవాలి. ప్రాసెస్‌ ఆన్‌ లో ఉంది. క్లాస్‌ హీరోతో మాస్‌ డైరెక్టర్‌.. ఇంట్రెస్టింగ్‌ గా లేదూ?
Tags:    

Similar News