అదృష్టమంటోన్న వినాయక్ శిష్యుడు

Update: 2016-12-16 09:30 GMT
కాస్త కష్టపడితే సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా అవకాశం పొందగల్గచ్చేమో కానీ డైరెక్టర్ కావడం మాత్రం అంత సులభం కాదు. కోట్లు పెట్టే నిర్మాతని మెప్పించాలి.. హీరో- హీరోయిన్స్ ని ఒప్పించాలి.. ఇవన్నీ దాటుకోని తీసిన సినిమాని రిలీజ్ అయ్యేలా చూసుకోవాలి. చాలా కష్టాలుంటాయ్ దర్శకుడికి. అందుకే డైరెక్టర్ వర్క్ అంత ఈజీ కాదు. డ్రీమ్ డెబ్యు చాలా తక్కువమందికి దక్కుతుంది.

నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ డైరెక్టర్ భాస్కర్ బండి కూడా అదృష్టం ఉండబట్టే తనకిలాంటి అవకాశం వచ్చిందంటున్నాడు. అలాగని ఇలా వచ్చి అలా డైరెక్టర్ అయిపోలేదు. వీవీవినాయక్- ఛోటా కె నాయుడు లాంటి దిగ్గజాల దగ్గర పదేళ్లు పనిచేశాడు భాస్కర్. వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. ఆ అనుభవంతోనే దర్శకుడిని అయ్యానంటున్నాడు.  నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ మొదటి సినిమా అయినప్పటికీ తనకెలాంటి టెన్షన్ లేదంటున్నాడు ఈ డైరక్టర్. తండ్రి- కూతుళ్ల మధ్య అనుబంధంతో ముడిపడిన కథ అందరికీ నచ్చిందని.. చూసిన వాళ్లంతా సినిమా బాగుందంటున్నారని.. మంచి టీమ్ తో పని చేసే అవకాశం వచ్చిందని అందుకే రిలాక్స్ గా ఉన్నానని మూవీ హిట్టవుతుందని నమ్మకంగా ఉన్నాడు.

ఈ చిన్న సినిమా హిట్టైతే టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికినట్టే. మరి వినాయక్ శిష్యుడు ఏం చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News