మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మూడవ రోజు కూడా బీభత్సం క్రియేట్ చేసింది. ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా తుపాకీ అంచనా ప్రకారం బాక్సాఫీస్ వద్ద రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళుతుంది. ఇక మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి మరోసారి 100 కోట్ల లిస్ట్ చేరారు. ఇంతకు ముందు వచ్చిన సినిమాలు కంటే ఈసారి అసలైన కం బ్యాక్ ఇచ్చారు అని చెప్పవచ్చు.
ఇక సంక్రాంతి రోజున వాల్తేరు వీరయ్య సినిమా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా కంటే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. యూఎస్ లో కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబడం విశేషం. ప్రీమియర్స్ ద్వారానే 682, 860 డాలర్స్ అందుకోవడం విశేషం. ఇక మొదటి రోజు యూఎస్ లో 308,911 డాలర్స్, రెండవ రోజు 392,532 డాలర్స్, మూడవరోజు 310, 220 డాలర్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు యూఎస్ టోటల్ గ్రాస్ 1,694,523 డాలర్స్.
1.7 మిలియన్ డాలర్స్ ను ఈజీగా దాటిన ఈ సినిమా 2 మిలియన్స్ ను కూడా తొందరలోనే అందుకుంటుంది అని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 47.46 కోట్ల షేర్ కలెక్షన్స్, 76.80 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక కర్ణాటక అలాగే రెస్టాఫ్ ఇండియాలో ఈ సినిమాకు 3.90 కోట్లు షేర్ రాగా మొత్తంగా ఓవర్సీస్ లో అయితే 7.55 కోట్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా వాల్తేరు వీరయ్య 60 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 108 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
సంక్రాంతి రోజు అయితే వాల్తేరు వీరయ్యకు బాగా కలిసి వచ్చింది. లాభల్లోకి రావాలి అంటే ఈ సినిమా ఇంకా 27 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సి ఉంది. ఇక మిగతా సినిమాలకు అంతగా పాజిటివ్ టాక్ రాకపోవడంతో కమర్షియల్ గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకుంటుంది. కాబట్టి సోమవారం కూడా కలెక్షన్స్ మరింత గట్టిగానే వచ్చే అవకాశం ఉంది. మంగళవారం నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుంది. మరి అప్పుడు మెగాస్టార్ ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.