తెలుగు స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్ గురించి రెగ్యులర్ గా వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రచ్చ చేయడంతో పాటు అవతలి హీరోను అవమానించే విధంగా మీమ్స్ ను క్రియేట్ చేయడం.. ఫన్నీ వీడియోలను క్రియేట్ చేయడం చేస్తున్నారు.
కొందరు ఒక అడుగు ముందుకు వేసి అత్యంత జుగుప్సాకరంగా యాంటీ ఫ్యాన్ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయమై ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు గొడవ పడే అభిమానులు ఈ ఫ్లెక్సీని ఒకసారి చూడాలి.
ఈ అరుదైన ఫ్లెక్సీ ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో సందడి చేసింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో అభిమానులు ఇలా కలిసి సంయుక్తంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆలోచించే విధంగా చేసింది.
నెట్టింట తెగ షేర్ అవుతున్న ఈ ఫ్లెక్సీ ఫొటో ఇద్దరు స్టార్ హీరోల యొక్క ఫ్యాన్స్ మధ్య ఉండాల్సిన స్నేహంను చూపించాయి. నేడు వీర సింహారెడ్డి విడుదల అవ్వగా... రేపు వాల్తేరు వీరయ్య సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమాల థియేటర్ల వద్ద మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ యొక్క వార్ తప్పదు. వారంతా ఇలా స్నేహంగా ఉండాలని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.