ఇండస్ట్రీలో ఎంత మంది పెద్ద స్టార్స్ వున్నా మాస్ ని మెప్పించగలిగే వాళ్లకే ప్రేక్షకులు అగ్ర తాంబూలం ఇస్తారన్నది గత కొన్నేళ్లుగా చూస్తున్నదే. మాస్ ని విశేషంగా ఆకట్టుకున్నారు కాబట్టే స్వర్గీయ నందమూరి తారక రామారావు మాస్ లీడర్ అయ్యారు.. ఆ మాస్ ఇమేజ్ వల్లే పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే చరిత్ర సృష్టించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికారు. నటుడిగా, పొలిటికల్ లీడర్ గా తన కీర్తిని విశ్వ వ్యాప్తం చేసుకుని టాలీవుడ్ సినీ చరిత్రలో చిరస్థాయిగా మాస్ హీరోగా నిలిచిపోయారు.
అదే ఫార్ములాని ఫాలో అవుతూ ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ప్రవేశించినా కొంత మంది మాత్రమే ఆ ఇమేజ్ ని దక్కించుకుని మాస్ ప్రేక్షకుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.. ఇప్పటికీ అదే పంథాని కొనసాగిస్తూ దశాబ్దాల కాలంగా మాస్ ఆడియన్స్ ని అలరిస్తూ వారి నీరాజనాలందుకుంటున్నారు. ఈ విషయంలో టాప్ లో నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి. `ఖైదీ` నుంచి మాస్ హీరోగా తనదైన మార్కు సినిమాలతో సంచలనాలు సృష్టిస్తూ ఎదురులేని హీరోగా నెంబర్ వన్ స్థానాన్ని గత మూడు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
మాస్ ఇమేజ్ తో టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా చిరు జేజేలందుకుంటున్నారు. ఆయన స్థాయిలో ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. `సమరసింహారెడ్డి` మూవీ బాలయ్య ఇమేజ్ ని మరింతగా పెంచేసి గాడ్ ఆఫ్ మాసెస్ గా మార్చేసింది. ఆ తరువాత మాస్ కు మరింతగా దగ్గరవుతూ వచ్చిన బాలయ్య ఇప్పటికీ అదే ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూ బ్లాక్ బస్టర్ మూవీస్ తో థియేటర్లలో రచ్చ చేస్తున్నారు.
బాయ్య సినిమా థియేటర్లలోకి వస్తోందంటే మాస్ ఆడియన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. దానికి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `వీర సింహారెడ్డి`నే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీ కోసం థియేటర్లలో ఆడియన్స్ చేసిన హంగామా అంతా ఇంతాకాదు. మాస్ హిస్టీరియాతో పూనకాలతో ఊగిపోవడమే కాకుండా యుఎస్ లోని ఓ థియేటర్ లో నానా రచ్చ చేయడంతో మధ్యలో షోని నిలిపి వేయాల్సి వచ్చిందంటే బాలయ్య మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో వుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇదే నందమూరి ఫ్యామిలీ నుంచి వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్న స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ ప్రారంభం నుంచి `ఆది`, సింహాద్రి వంటి మాసీవ్ బ్లాక్ బస్టర్లతో మాస్ ప్రేక్షకుల్లో హ్యూజ్ క్రేజ్ ని దక్కించుకున్న ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమా వస్తోందంటే నెట్టింట ఫ్యాన్స్ చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ గా `RRR` ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో పోటీపడి అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో యుఎస్ లో వున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదే ఎన్టీఆర్ కున్న మాస్ ఇమేజ్ కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ హీరోల తరువాత ఆ స్థాయిలో కాకపోయినా కొంత వరకు తనదైన మార్కు సినిమాలతో మాస్ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకుని మాస్ మహారాజా అనిపించుకున్న హీరో రవితేజ. తనకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ఇమేజ్ కారణంగా ఇటీవల విడుదలైన `ధమాకా` బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఊహకందని స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించి వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.