పార్టనర్ షిప్ బిజినెస్ లు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనే లేదు. ఎందరో మహానుభావులు ఆ ఒక్క తప్పు చేసి బొప్పి కట్టించుకున్న సందర్భాలున్నాయి. ఎవరైనా బిజినెస్ మొదలు పెడితే అస్సలు భాగస్వామ్యంలో చేయొద్దని ఇలాంటి వాళ్లు సలహాలిస్తుంటారు. అయితే వందల కోట్ల రూపాయల బడ్జెట్లు అవసరమయ్యే సినీపరిశ్రమలో ఇలా కుదరదు. తప్పనిసరిగా పార్ట్ నర్ షిప్ ఉండాల్సిందే.
ఇప్పుడు ఓ హీరోయిన్ కం నిర్మాతతో భాగస్వామ్యంలో సినీనిర్మాణం చేస్తున్న ఓ స్టార్ డైరెక్టర్ ఊహించని విధంగా పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ హీరోతో బాలీవుడ్ లింకుల్ని ఆపరేట్ చేయించడంతో అనూహ్యంగా అది కాస్తా పాన్ ఇండియా రేంజుకు చేరిపోవడం సడెన్ ట్విస్ట్. అయితే సదరు హిందీ నిర్మాతకు ఆల్రెడీ ఉన్న తలనొప్పులతో ఇప్పుడు ఈ మూవీకి బడ్జెట్లు సమకూర్చలేక సతమతమవుతున్నాడట.
దీంతో మహమ్మారీ బ్రేక్ అనంతరం కూడా బడ్జెట్ నిధులు రాక సదరు డైరెక్టర్ వెయిటింగ్ లో ఉన్నారని తెలుస్తోంది. అక్కడ ఆయన సినిమాల ప్రాధాన్యతా క్రమంలో బడ్జెట్లు సర్ధుతున్నారని దీనివల్ల ఇక్కడ మూవీ నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. ప్లాన్ పెద్దగా ఉంటేనే సరిపోదు.. అన్నీ సక్రమంగా కుదరాలి. లక్ కలిసి రావాలి. కంటెంట్ బావుండాలి. ఇన్ని ఉన్నా టైమింగ్ సెట్టవ్వాలి. ఎన్ని ఉన్నా కరోనా మహమ్మారీ లాంటి విపత్తు సంభవిస్తే అంతా గోల్ మాల్ అయిపోతుంది. అదృష్ట వశాత్తూ ఆ మూవీ ఒక షెడ్యూల్ మాత్రమే అయ్యింది ఇప్పటికి. మిగతా షూటింగ్ అంతా చేయాల్సి ఉంది.
సదరు హిందీ నిర్మాత ఫండ్ రిలీజ్ చేస్తే చకచకా పనులు పూర్తి చేయాలని ఇక్కడ స్టార్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు. అటు బాలీవుడ్ సినిమాల షూటింగులు కరోనా తాకిడి వల్ల నత్తనడకన సాగడం ఇబ్బందికరంగా మారింది. అక్కడ లైన్ క్లియరైతే కానీ ఇక్కడ ఫండ్ రిలీజ్ కాదట. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందో వేచి చూడాలి.