బిగ్ ఫైట్‌: బాహుబ‌లి వ‌ర్సెస్ కంచె

Update: 2015-09-18 13:30 GMT
బాహుబ‌లి యుద్ధ విన్యాసాలు చూశాక క‌ళ్లు భైర్లు క‌మ్మాయి తెలుగు ప్రేక్ష‌కుల‌కు. అసాధార‌ణ పోరాట విన్యాసాలు ఎలా ఉంటాయో ప్ర‌త్య‌క్షంగా చూసిన అనుభూతి పొందారు. అదంతా రాజ‌మౌళి వ‌ల్ల సాధ్య‌మైన ఫీట్‌. ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాల కోసం దాదాపు 2000 మంది జూఐనియ‌ర్ ఆర్టిస్టుల్ని సైనికుల్లాగా ఉప‌యోగించారు. కాళ‌కేయ బృందం విరుచుప‌డే స‌న్నివేశాల్లో భారీ జ‌న‌స‌మూహం ,యుద్ధం మ‌హాద్భుతం అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌లో వీళ్ల‌నే ల‌క్ష‌లాది సైన్యంలా చూపించి మ్య‌జాక్ చేశారు. క‌త్తులు, యుద్ధ ట్యాంక‌ర్లు - గ‌ధ‌లు - భ‌ళ్లాలు - ఈటెలు ఎన్నెన్నో ఆయుధాల్ని ఉప‌యోగించాడు అందులో.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ అసాధార‌ణ‌మైన యుద్ధం అంటే ఎలా ఉండ‌బోతోందో కంచె సినిమాలో చూడ‌బోతున్నాం. ఇందులో రెండో ప్ర‌పంచ‌యుద్ధానికి మ‌న దేశంతో ఉన్న లింక్‌ని చూపిస్తున్నారు. వైజాగ్ ప‌రిస‌రాల్లో జ‌పాన్ యుద్ధ‌నౌక‌లు - జ‌ప‌నీ సైన్యం ప‌రుగుల్ని క్రిష్ చూపిస్తున్నాడు. ఇందులోనే క‌థానాయ‌కుడి విరోచిత పోరాటాల్ని క‌ళ‌ల్ని ఆవిష్క‌రిస్తున‌నాడు.

రెండో ప్ర‌పంచ‌యుద్ధంలో ఉప‌యోగించిన 4 యుద్ధ ట్యాంక‌ర్లు - 700 రియ‌ల్ గ‌న్‌ లు - ఒక మెషీన్‌ గ‌న్ ఉప‌యోగించారు. ఈ గ‌న్స్‌ ని, యుద్ధ ప‌రిక‌రాల్ని ఎలా ఉప‌యోగించాలి వ‌రుణ్‌ తేజ్‌ కి అవ‌స‌రాల శ్రీ‌నివాస్ నేర్పించాడు. 700 మంది పైగా జూనియ‌ర్ ఆర్టిస్టులు యుద్ధ సైనికుల్లా ప‌నిచేశారు. 700 పైగా డమ్మీ బుల్లెట్స్‌ ని యుద్ధ స‌న్నివేశాల్లో ఉప‌యోగించారు. తుపాకీల ఫైరింగ్ ద‌ద్ద‌రిల్లిపోతుంది ఈ యుద్ధంలో. లైవ్‌ లో యుద్ధం చూపిస్తున్నాడు. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ విజువ‌ల్ ఫీస్ట్ షురూ.. కంచె రూపంలో.
Tags:    

Similar News