రూ.100 టిక్కెట్టుపై 99 బాల‌య్య సినిమాలు

Update: 2016-10-01 10:39 GMT
ప్ర‌స్తుతం ఒక్క మూవీని థియేట‌ర్‌ కి వెళ్లి చూసేందుకే రూ.500 కాగితం ఫ‌ట్ మ‌ని ఎగిరిపోతుంటే.. అలాంటిది రూ.100కు  99 మూవీలు చూపిస్తామంటే? అది కూడా నంద‌మూరి అంద‌గాడు - బాల‌కృష్ణ టోట‌ల్ మూవీలైతే.. ఎగిరి గంతేసి.. మూవీస్‌ టికెట్‌ ను అందుకోవాలంతే!! బాల‌య్య అభిమానుల‌కు ఇది నిజంగానే బంప‌ర్ ఆఫ‌ర్‌! అయితే, ఇలా ఎందుకు? ఏమిటి? ఎలా? అని అనుకుంటున్నారా..? అయిన‌నూ వెళ్లి టికెట్ కొనేసుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇది చ‌ద‌వండి టికెట్లు ఎక్క‌డ దొరుకుతాయో? అస‌లీ ఆఫ‌ర్ వెనుక ఏముందో?  మీకే తెలుస్తుంది! కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నందమూరి అభిమానులు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బాల‌య్య న‌టించిన మొత్తం మూవీల‌ను ప్రొద్దుటూరు పట్టణంలోని అర్చన థియేటర్‌ లో ప్రతిరోజు ఒక షోలో ఒక సినిమాను ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ యజమాని ఓబుల్‌ రెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పటివరకు ఎప్పుడూ, ఎక్కడా జరగని రీతిలో ఒక హీరో నటించిన అన్ని సినిమాలను ఒకే చోట ప్రదర్శించి లిమ్కా రికార్డు దక్కించుకుంటామని ప్రొద్దుటూరు నందమూరి అభిమాన సంఘం పేర్కొంది. దసరా - దీపావళి - మొహరం - క్రిస్‌ మస్ పండుగల స్పెషల్ బంపర్ ఆఫర్‌ గా నంద‌మూరి అభిమానులకు ఈ ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో బాల‌య్య త‌న ఇండ‌స్ట్రీ లైఫ్‌ లో న‌టించిన మొత్తం 99 సినిమాల‌ను ఒకే టికెట్టుపై రోజుకో మూవీ చొప్పున బాల‌య్య అభిమానుల‌కు చూపించాల‌ని డిసైడ్ అయ్యారు.

 వాస్త‌వానికి ప్ర‌స్తుతం బాల‌య్య 100 వ మూవీ గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్‌ లో ఉంది. ఇది పూర్త‌వ‌డానికి మ‌రో 99 రోజులు ప‌ట్టే ఛాన్స్ ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఈ 99 మూవీల‌ను పూర్తి చేసి.. 100 వ మూవీకి అదిరిపోయే వెల్‌ కం చెప్పాల‌ని ప్రొద్దుటూరు బాల‌య్య అభిమాన సంఘం డిసైడ్ అయింది. ఈ నేప‌థ్యంలోనే 99 మూవీస్ @ 100 రూపీస్ అనే స్కీంకి ప్లాన్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ప్లాన్‌కి సంబంధించి పాంప్లేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. ఏదైనా బాల‌య్య అభిమానుల ప్లానే ప్లాన్ అనుకుంటున్నారు దీనిని చ‌దివిన వాళ్లు! ఇక‌, ఆల‌స్యం ఎందుకు టికెట్ తెచ్చుకునేందుకు బ‌య‌లుదేరండి మరి!!  ఇక ఇదే థియేట‌ర్లో లెజెండ్ ప్ర‌తి రోజు ఉద‌యం 11 గంట‌ల షోతో ఇప్ప‌టికే 920 రోజులు పూర్తి చేసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News