మేమిద్దరం మాకిద్దరు.. విఘ్నేష్ నయన్ సూపర్ పిక్..!

Update: 2022-10-25 06:24 GMT
కోలీవుడ్ క్రేజీ జోడీ విఘ్నేష్ నయన్ లు నిన్న మొన్నటిదాకా వార్తల్లో ఉన్నారు. పెళ్లైన నాలుగు నెలలకే కవలు పిల్లలు పుట్టడం ఏంటి అని మీడియాలో ఒకటే హడావిడి. మన దేశంలో లేనటువంటి సరోగసి విధానం ద్వారా పిల్లలు కనడం వల్ల వాళ్లకు శిక్ష తప్పదని కూడా వార్తల్లో వచ్చాయి.

అంతకుముందు వీరి పెళ్లి వీడియో గురించి కూడా వివాదం నెలకొంది. వీటన్నిటికీ ఒక క్లారిటీ వచ్చినట్టు అర్ధమవుతుంది. లేటెస్ట్ గా నయన్ విఘ్నేష్ తమ ట్విన్స్ తో దీపావళి విషెస్ అందించారు.

మేమిద్దరం మాకిద్దరు అన్న విధంగా ఇద్దరు పిల్లలను చెరొకరు ఎత్తుకుని వారితో పాటుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు నయన్ విఘ్నేష్. దర్శకుడిగా విఘ్నేష్.. స్టార్ హీరోయిన్ గా నయన్ ఇద్దరు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. పెళ్లి వల్ల వారి కెరియర్ కు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా మేనేజ్ చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేస్తూ పెళ్లి కాకుండానే ఇద్దరు ఒకేచోట ఉంటూ నిత్యం వార్తల్లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకోవడం కూడా జనాలకు హాట్ టాపిక్ అయ్యింది. డెస్టినేషన్ వెడ్డింగ్ లా.. కేవలం కుటుమ సభ్యులు మాత్రమే నయన్ విఘ్నేష్ ల పెళ్లికి అటెండ్ అయ్యారు.

పెళ్లైనా సరే హీరోయిన్ గా నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆమెని కావాలని తీసుకుంటున్నారు. నయన్ తో సినిమా ఆమెకు కుదిరినప్పుడే డేట్స్ అడ్జెస్ట్ చేసి మరి హీరోయిన్ గా ఫిక్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నయనతార నటించింది.

తెలుగు సీనియర్ స్టార్ హీరోలకు నయనతార ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తుంది. నయన్ దూకుడు చూస్తుంటే ఇదే ఫామ్ ని మరో ఐదారేళ్లు ఈజీగా కొనసాగించేలా ఉంది. 100 సినిమాల టార్గెట్ తో ఆమధ్య కోలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన నయన్ పెళ్లి కోసం కెరియర్ కు కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు అమ్మడు మళ్లీ వరుస సినిమాలకు సైన్ చేస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News