టాలీవుడ్ స్టార్ హీరోలంతా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకొని ఉన్నారు. కోవిడ్ కారణంగా చాలా సమయం వృధాగా పోవడంతో.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. కాకపోతే ఏదీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నట్లు జరగకపోవడంతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయి.
ప్రస్తుతం ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్నన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మరో హీరో చేయడం లేదనడంలో అతిశయోక్తి లేదు. ఈ యేడాదిలో "రాధే శ్యామ్" తో పలకరించిన డార్లింగ్.. 2023 సంక్రాంతికి "ఆదిపురుష్" చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు వివిధ కారణాలతో ఈ పౌరాణిక చిత్రం జూన్ 16కు వాయిదా పడింది.
సమ్మర్ లో "సర్కారు వారి పాట" సినిమాతో సందడి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. వచ్చే వేసవికి SSMB28 చిత్రాన్ని అందించాలని అనుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2023 ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా షూట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు ఒక చిన్న షెడ్యూల్ ను మాత్రమే చిత్రీకరించారు. రెండో షెడ్యూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలా షూటింగ్ చేస్తే వచ్చే ఏప్రిల్ నాటికి మూవీ రిలీజ్ అసాధ్యమనిపిస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హరి హర వీరమల్లు" చిత్రాన్ని కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ చెప్పిన సమయానికి వస్తారా లేదా అనేది అనుమానంగానే వుంది. ఇక RRR సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇప్పుడప్పుడే బిగ్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం లేదు.
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ కమిటైన NTR30 మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే జనవరిలో మొదలవుతుందని టాక్. శంకర్ దర్శత్వంలో చరణ్ నటిస్తున్న RC15 సినిమా 'ఇండియన్ 2' కారణంగా మెల్లిగా సాగుతోంది. వచ్చే యేడాది చివర్లో ఈ భారీ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
"పుష్ప" తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప 2" చిత్రాన్ని చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మొదలవుతుందని చెప్పిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ నెలాఖరున సెట్స్ మీదకు వెళ్తుందని.. బ్యాంకాక్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీని ప్రకారం 2023 ప్రథమార్థంలో స్టార్ హీరోల సినిమాలేవీ థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహ నందమూరి బాలకృష్ణ వంటి ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రం ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. "వాల్తేరు వీరయ్య" మరియు "వీర సింహారెడ్డి" సినిమాలు రాబోయే సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఇక మరో ఇద్దరు సీనియర్ హీరోలు కింగ్ అక్కినేని నాగార్జున & విక్టరీ వెంకటేష్ ఇంకా తమ తదుపరి చిత్రాలను అనౌన్స్ చేయలేదు.
సాధారణంగానే స్టార్ హీరోల సినిమాలకు హైప్ ఉంటుంది కాబట్టి.. జనాలను థియేటర్స్ కు రప్పించడంలో వాటి భాగం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కోవిడ్ తరువాత ప్రేక్షకులను సినిమా హాళ్ళ వరకూ నడిపించడం చాలా కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆరేడు నెలలు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు.
ఇప్పుడు జనాలను ఎంటర్టైన్ చేసే బాధ్యత మీడియం రేంజ్ హీరోలపై పడింది. అఖిల్ అక్కినేని "ఏజెంట్" - విజయ్ దేవరకొండ "ఖుషి" - నాని "దసరా".. టైర్-2 హీరోల సినిమాలే 2023 ఫస్టాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. మరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ హీరోలు ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.